మంత్రి ఆదినారాయ‌ణ‌. తాజాగా మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లోకి వ‌చ్చిన మంత్రి వ‌ర్యులు. రాజ‌కీయాల్లో ఉ న్నంత మాత్రాన అంతా నాదే.. నేనే శాశ్వ‌తం అనుకునే ధోర‌ణిని పూర్తిగా అవ‌లంబించే నాయ‌కుడిగా ఆది పేరు తెచ్చు కున్నారు. తాజాగా ఆయ‌న చేసిన స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్ల‌పై నేరుగా చంద్ర‌బాబు దృష్టి పెట్టార‌ని స‌మాచారం. క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఆదినారాయ‌ణ‌.. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే, ఆ త‌ర్వాత ఆయ‌న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో భాగంగా వ‌చ్చి.. టీడీపీలో చేరిపోయారు. మంత్రి ప‌ద‌విని కూడా సంపాయించారు. అంతేనా.. జిల్లా ఇంచార్జ్‌గా కూడా ఉన్నారు. 

Image result for మంత్రి ఆదినారాయ‌ణ‌

ఇలా కీల‌క‌మైన ప‌ద‌విలో ఉన్న ఆది.. నోటి దుర‌ద‌తో రెచ్చిపోతుండ‌డ‌మే తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌వుతోంది. త‌న‌ను ప్ర శ్నించ‌డాన్ని సైతం ఆది స‌హించ‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో జ‌మ్మ‌ల‌మ‌డుగులోని కొన్ని గ్రా మాల్లో అందునా.. ఆదికి ప‌ట్టున్న ప్రాంతాల్లో వైసీపీ నాయ‌కులు జెండాలు పాతారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను వైసీపీలోకి తీసుకు వ‌చ్చారు. ఈ ప‌రిణామాన్ని ఆది అస్స‌లు స‌హించ‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. ఇటీవ‌ల స్థానిక స‌మ‌స్య‌ల పై, ముఖ్యంగా తాగునీటి విష‌యంపై వైసీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు ప్ర‌సాద‌రెడ్డి ప్ర‌శ్నించారు. అయితే, న‌న్నే ప్ర‌శ్నిస్తావా? అంటూ ఆది రెచ్చి పోయారు. 


దీంతో ఇద్ద‌రి మ‌ధ్య‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 2019లో వైసీపీ అధికారంలోకి రాకపోతే జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయనని, టీడీపీ అధికారంలోకి రాకపోతే మీరు ఎప్పటికీ పోటీ చేయరా అంటూ.. ఆదినారాయణరెడ్డికి రాచమల్లు సవాల్ విసిరారు. రాచమల్లు సవాల్‌కు ఆదినారాయణరెడ్డి సీరియస్‌గా స్పందించారు. వేచి ఉండండి..మీ ఊరికే వస్తున్నా...మీ కథ చూస్తా అంటూ  మంత్రి మండిపడ్డారు. ఈ ప‌రిణామంపై ఇప్పుడు మ‌రింత అగ్గి రాజుకుంది. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న స్థానిక టీడీపీ నాయ‌కులు ఏకంగా ఆదిపైనే సీఎం చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేశారు. పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టించ‌డం కాక‌మ‌రేమిట‌నివారు బాబు కు వెల్ల‌డించారు. దీంతో బాబు కూడా ఫైరైన‌ట్టు స‌మాచారం. ఎన్నిక‌ల ముంగిట ఇలా సంయ‌మ‌నం కోల్పోయి వ్య‌వ‌హ‌రిస్తే.. పార్టీ ప‌రువు ఏమ‌వుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించినట్టు తెలిసింది. మ‌రి ఆది మార‌తారో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: