ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయాల్లో మార్పులు స‌హ‌జం. ఒకింత గెలుపు గుర్రం ఎక్కుతుంద‌ని భావిస్తున్న పార్టీ వైపు నాయ‌కులు మొగ్గు చూపుతున్నారు. నిజానికి రాజకీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు లేర‌ని అన్న‌ట్టుగానే ఏనాయ‌కుడు కూడా ఏ పార్టీకీ శ‌త్రువు కాదు, మిత్రుడు కాదు. ఎవ‌రైనా త‌మ అవ‌స‌రాల‌కు అనుకూలంగా ఉన్నంత వ‌ర‌కు పార్టీలో ఉంటారు. ఏ పార్టీ అయినా.. నాయ‌కు డి తో అవ‌స‌రం ఉంటుంద‌ని అనుకుంటేనే ఆ పార్టీలో కొన‌సాగిస్తాయి. ఏమాత్రం తేడా వ‌చ్చినా వేరేవారికి ప‌గ్గాలు అప్పగించ‌డం మ‌న‌కు తెలిసిందే. ఇది ఎక్కువగా ఇప్పుడు వైసీపీలో జ‌రుగుతోంంది కూడా! టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ఈ సూత్రానికి అతీతులు కారు. త‌న‌కు ప‌నికి రార‌ని అను కున్న వారిని ఆయ‌న కూడా ప‌క్క‌న పెట్టిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. 


అదేవిధంగా నాయ‌కులు కూడా త‌మ‌కు అనుకూలంగా ఉన్న పార్టీల వైపు మొగ్గుతున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ ఇస్తుంద‌ని, లేదా గెలిపిస్తుంద‌ని భావిస్తున్న పార్టీల‌కు నాయకులు మారిపో తున్నారు. ఇప్పుడు ఇలాంటి వారిలో రాజ‌మండ్రి సిటీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ పేరు వినిపిస్తోంది. ప్ర‌స్తుతం బీజేపీ టికెట్‌పై ఆయ‌న ఇక్క‌డ నుంచి 2014లో విజ‌యం సాధించారు. అయ‌తే, టీడీపీ-బీజేపీ కూట‌మిలో భాగంగా అప్ప‌ట్లో ఈయ‌న‌కు ఈ టికెట్ కేటాయిం చారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న పార్టీ మారిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న అనుచ‌రులు బాహాటంగానే చెబుతున్నారు. ఇటీ వ‌ల కొన్ని ఫెక్సీల్లో ఆయ‌న పేరు తప్ప పార్టీ పేరును ప్ర‌స్తావించ‌క‌పోవ‌డాన్ని బ‌ట్టి.. ఆయ‌న పార్టీ మారిపోతు న్నార‌నే విష‌యానికి బ‌లం చేకూరిన‌ట్టు అయింది.


కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఆకుల త్వ‌ర‌లోనే పార్టీ మారుతున్నార‌ని ఆయ‌న అనుచ రులు గ్రౌండ్ లెవిల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళ్తార‌న ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెల కింద‌ట రాజ మండ్రిలో నిర్వ‌హించిన క‌వాతు స‌మ‌యంలో కూడా దీనికి ప‌రోక్షంగా సాయం చేశార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. అయితే, తాను ఏమీ చేయ‌లేద‌ని చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు వెలుగు చూస్తున్న విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌లోకి వెళ్లిపోవాల‌ని ఆకుల భావిస్తున్నార‌ట‌. ప్ర‌ధానంగా ఇప్పుడు బీజేపీ టికెట్‌పై పోటీ చేసినా.. నిలిచి గెలిచే ప‌రిస్థితి లేద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన‌లోకి వెళ్లాల‌ని ఆకుల నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.


 గ‌త ఎన్నిక‌ల్లోనూ భారీ ఎత్తున మెజారిటీ సాధించిన ఆకుల‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తనకు పార్లమెంటు టిక్కెట్టు కానీ, తన భార్యకు అసెంబ్లీ టిక్కెట్టు కానీ ఇవ్వాలని ఇప్పటికే జనసేన అధినేతతో ఒప్పందం చేసుకున్నట్టు చెప్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి నెరవేర్చని బీజేపీలో ఉన్న నేతలు పలువురు జనసేన వైపు దృష్టిసారించార‌నే విష‌యం గ‌త కొన్నాళ్లుగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీనిలో భాగంగా.. ఇప్పుడు తొలి వికెట్‌గా ఆకుల పేరు బాహాటంగా వినిపిస్తుండ‌డం ఆస‌క్తిగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: