రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఓటమి తప్పదని జాతీయ మీడియా జరిపిన ప్రతీ సర్వేలో స్పష్టంగా అర్దమవుతోంది. చంద్రబాబు సొంతంగా చేయించుకుంటున్న సర్వేల్లో కూడా పార్టీ పరిస్ధితి ఏమంత బావోలేదనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశ్యంతోనే  చంద్రబాబునాయుడు కొత్త వ్యూహాన్ని కనిపెట్టినట్లున్నారు. అదే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవిఎం)లపై యుద్దం.

Image result for evms and chandrababu

ఈవిఎంలను పూర్తిస్ధాయిలో వ్యతిరేకిస్తున్న చంద్రబాబు తాజాగా పేపర్ బ్యాలెట్ మాత్రమే ఉండాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పైగా ప్రపంచమంతా పేపర్ బ్యాలెట్ పైనే ఎన్నికలకు వెళుతుంటే మన దేశంలో మాత్రం ఈవిఎంలు ఎందుకంటూ ప్రశ్నించటం విచిత్రంగానే ఉంది. నిజానికి ఒకపుడు ఈవిఎం వ్యవస్దను స్వాగతించిందే చంద్రబాబు. అయితే చంద్రబాబు ఓడినపుడల్లా మళ్ళీ ఈవిఎంలను వ్యతిరేకిస్తుంటారు లేండి అది వేరే సంగతి. మరి తాజాగా చంద్రబాబు ఓడిందేమీ లేదు కదా ? మరి ఈవిఎంలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే ప్రశ్న అందరిలోను మొదలైంది.

Image result for evms and chandrababu

ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, తెలంగాణా ఎన్నికల్లో తల బొప్పి కట్టింది కదా ? ఎన్నికల్లో గెలవటానికి ఎన్ని మాయోపాయాలు చేసినా జనాలు చంద్రబాబును ఛీ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. సరే, అదే సమయంలో గెలిచిన టిఆర్ఎస్ పైన కూడా అనేక ఆరోపణలు, విమర్శలున్నాయి. ఈవిఎంలను, వివిప్యాట్లను మ్యానేజ్ చేసుకోవటం వల్లే టిఆర్ఎస్ మళ్ళీ గెలిచిందనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది.ఇక్కడే చంద్రబాబు బుర్ర పాదరసంలాగ పని చేసింది.

Image result for evms and chandrababu

రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై జనాల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఆ విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. కాబట్టి వచ్చే ఎన్నకల్లో గెలుపు దాదాపు కష్టమే. ఈ పరిస్దితుల్లో మళ్ళీ గెలవాలంటే పోలింగ్ ను మ్యానేజ్ చేసుకోవటమొకటే మార్గం. అందుకే ఏకైక మార్గం దొంగ ఓట్లు వేసుకోవటమే. ఈవిఎంలున్నపుడు దొంగ ఓట్లు వేసుకోవాలంటే  పేపర్ బ్యాలెట్ అంత వీజీ కాదు. అందుకనే ఇఫ్పటి నుండే ఈవిఎంల స్ధానంలో పేపర్ బ్యాలెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

 Image result for paper ballots

త్వరలో జరగబోయే స్దానిక సంస్ధల ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ ద్వారానే నిర్వహించనున్నట్లు ప్రకటించేశారు. అంటే సార్వత్రిక ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ ద్వారా ఏ మేరకు లాభం జరుగుతుంది ? లాభం జరగాలంటే ఏ స్ధాయిలో పోలింగ్ కేంద్రాలను మ్యానేజ్ చేసుకోవాలన్న విషయంలో స్ధానిక సంస్ధలను రిహార్సిల్ గా చంద్రబాబు ఎంచుకున్నట్లు అర్ధమవుతోంది. స్ధానిక సంస్దల్లో గనుక చంద్రబాబు అనుకున్నట్లు ఫలితాలొస్తే పేపర్ బ్యాలెట్ వైపే మొగ్గు చూపుతారు. లేకపోతే ఏం చేయాలో అప్పటికప్పుడు ప్లన్ చేసుకుంటారు. కాబట్టి ఈ విషయంలో వైసిపి జాగ్రత్తగా ఉండకపోతే తీవ్రంగా నష్టపోవటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: