గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు ఏ రేంజ్ లో ఉండేవో అందరికీ తెలిసిందే.  ఇక్క మనిషి ప్రాణాలకన్నా పరువు, ప్రతీకారం కోసమే బతికేవాళ్లని అనేవారు.  కానీ కొంత కాలంతా రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు పూర్తిగా తగ్గిపోయాయి.  ప్రస్తుతం రాయలసీమ అభివృద్ది బాటలో నడుస్తుంది. గతంలో గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి మద్య ఫ్యాక్షన్ గొడవలు బీభత్సంగా ఉండేవి.  ఈ గొడవలో పరిటాల రవి దారుణంగా హత్య చేయబడ్డారు. 
Image result for maddelacheruvu suri
ఆ కేసు లో  మద్దెల చెరువు సూరి ప్రమేయం ఉందంటూ కేసు నడిచింది. ఇదిలా ఉంటే.. జనవరి 4, 2011లో హైదరాబాద్ లోని యూసప్ గూడ ప్రాంతంలో సూరి కారులో ప్రయాణిస్తుండగా ఆయన అనుచరుడు భాను కిరణ్ కాల్చి చంపాడు. 2012లో భానుకిరణ్ ని జహీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, మద్దెల చెరువు సూరి హత్య కేసులో హైదరాబాదు, నాంపల్లి కోర్టు  తుది తీర్పు వెలువరించనుంది. అయితే ఈ కేసు మూడు అంశాలను పరిగణలోకి తీసుకోబోతున్నారు.
Image result for maddelacheruvu suri
కాల్చి చంపింది భాను కిరణేనని సూరి కారు డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం, ప్రధాన నిందితుడి నుంచి సేకరించిన తుపాకీకి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు, ఈ హత్యకు సంబంధించి భానుకిరణ్ కి మిగిలిన నిందితులకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆధారంగా విచారణ పూర్తి చేసినట్టు సమాచారం. ఆయుధాల అక్రమ రవాణా కేసులో భాను కిరణ్ తో పాటు మరో ముగ్గురికి హైదరాబాద్ లోని స్థానిక కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.   అయితే ఈ హత్య కేసులో మరో ఆరుగురు పేర్లను పోలీసులు ఛార్జిషీట్ లో చేర్చారు. రేపు తుది తీర్పు ఎలా ఉండబోతుందా అని సూరి అభిమానుల, కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: