తెలంగాణా ఎన్నికలైపోయాయి టీఆరెస్ విజయవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయాల వేడుక మద్యలో వచ్చిన సదవకాశాన్ని వదులుకోకుండా యువరాజుకు పార్టీ పట్టాభిషేకం చేసేసింది. ఇప్పుడు పార్టీలో నంబర్ 2 ఎవరన్న సంధిగ్ధత తొలిగిపోయింది. పార్టీకి మహారాజు కేసీఆర్ ఐతే,  యువరాజు కేటీఆర్. అంటే టీఆరెస్ తెలంగాణాలో అప్రతిహతంగా ముందుకు సాగుతుందని రానున్న ఐదేళ్ళ కాలానికి అయుష్షు భయంలేదని చెప్పవచ్చు. స్వయంకృతాపరాధాలేమైనా ఉంటే ఇందుకు మినహాయింపు.
Image result for chandrababu naidu
ఒకవైపు చంద్రబాబు నాయుడు తను కేసీఆర్ తోనే పొత్తు పెట్టుకుందామని అనుకున్నానని, తను పొత్తు పెట్టుకుందామని కేసీఆర్ తో అన్నానని, అయితే ఆయనే  కాదన్నాడని, చీత్కరించాడని, తిరస్కరించాడని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ఎన్నికలకు ముందు ఎన్నికల తరవాత కూడా పలుమార్లు పదే పదే అంటున్నాడు. 
Image result for telugu media supports chandrababu
తెలంగాణ ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు ఈమాట చెప్పాడు. ఇప్పుడు కూడా అదేమాట చెబుతున్నాడు. తను తెలంగాణ రాష్ట్రసమితితోనే పొత్తు పెట్టు కుందామని అనుకున్నాను కాని అంటూ, అదేదో కేసీఆర్ నేరం చేసినట్లు చంద్రబాబు చెబుతున్నాడు. ఇష్టంలేని పెళ్ళెవరు చేసుకుంటారు. పెళ్ళైంది, ప్రేమ విందైంది. అయినా ఇంకా చంద్రబాబు సోదెంది? అని విశ్లేషకులు అంటున్నా — చంద్రబాబు కేసీఆర్ ప్రాపకం కోసం పడిన తుత్తర — ఈ పొత్తుకు ఆయన ఎంత ఆరాటపడ్డాడో  ఎంత  తీవ్రంగా ప్రయత్నించాడో? స్పష్టం అవుతోంది. దానికి ఆయన మాటలే సాక్ష్యం. 

మరి చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో కలవాలని అనుకున్నాడని స్పష్టం అవుతోంది కదా! అలాగే ఆయనలా వేరొకరు కోరుకోవటంలో తప్పు ఉండదుగా! అయితే ఇప్పుడు టీడీపీ నేతలు కొత్తపల్లవిగా టీఆరెస్ కు వైసీపీకి బంధం కలుపుతూ, అనేక ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ టీఆరెస్ తో జగన్ వైసీపీ స్నేహబంధం నెరుపు తోందని, అది పాపం! అది నేఱం! అని టీడీపీ నేతలు, పచ్చ పత్రికలు వేల నోళ్ళతో గొంతెత్తి చాటుతున్నారు. ఈ విషయంలో పచ్చ మీడియా గగ్గోలు అంతా ఇంతా అని చెప్పెలా లేదు. తాము టీఆరెస్ తో మైత్రి కోరుకున్నప్పుడు లేని తప్పు – వైసిపి ఒకవేళ కోరుకుంటే తప్పెలా అవుతుంది? అని ప్రజలు ప్రశ్నించలరన్న ఇంగితఙ్జానం ఏమాత్రం టిడికి నాయకత్వాని లేకుండా పోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

Image result for akhilesh maya mamata

అయినా పొత్తు ఇరుపక్షాలకు అమోదయోగ్యం కావాలి కదా! నేను ప్రేమించాను నీవూ ప్రేమించాల్సిందే అనటానికి వీలు లేదు కదా? టిడిపి ఓంటరి పోరాటం ఏనాడూ చేయలేదు, చేసే శక్తి గాని సాహసం గాని దానికి లేదు. ఎన్నికల్లో వైఫల్యాన్ని ఒకరిపైకి నెట్టటానికి ఒక బకరా దానికి కావాలి. రాష్ట్రంలో రాష్ట్రంతో సంబంధం ఉన్న అన్నీ పార్టీలతో అది దాని నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ జీవితాన్ని గడిపింది. ఎప్పుడూ ఎవరో ఒకరు బలౌతూ వస్తున్నారు. అందరు టిడిపి లీలలు దానికున్న మీడియా బలం, కుల బలం గుర్తించారు. ఇప్పుడు దాని మీడియా రాతలను చూసి వెక్కిరిస్తున్నారు. ఆ కుల సమాజాన్ని పోసాని కృష్ణ మురళి అన్నట్లు ద్వేషించకపోయినా - వారితో, జాగ్రత్త సుమా! అని అనుమానంగా చూస్తున్నారు. 

Image result for akhilesh maya mamata

బిజెపియేతర ఫ్రంట్ నుండి ప్రధాని పదవికి పోటీదారులు - ఇంకా కొందరున్నారు!

Image result for akhilesh maya mamata

బహుశా తెలుగు దేశం పార్టీ దాని చరిత్రలో గతంలో ఎన్నడూ అనుభవించని తీవ్రమైన నిస్పృహలో కొట్టూమిట్టాడుతుంది. అందుకే దాని నడతను నడకను మార్చుకొని ఇలా మాట్లాడుతోంది అని చెప్పక తప్పదు. ఒంటరినై పోయాను, ఇక ఇంటికి ఏమని పోనూ అనుకుంటూ — ఏదో ఒకటి,  ముండో, ముత్తైదువో దొరికితే చాలు అన్నట్లు తన ఆగర్భశత్రువు కాంగ్రెస్ తో పొత్తుపడక పంచుకున్నారు.

Image result for telugu media supports chandrababu

ఇప్పుడు రాజకీయ పక్షాలతో పాటు తెలంగాణా ప్రజలు కూడా టిడిపి వికృత పోకడలకుసిద్ధాంత రాహుత్యాన్ని రాజకీయం నీతి నియమం మానం లేని రాజకీయ నాటకాన్ని గుర్తించారు సంశయరహితంగా తగిన సమాధానం తమ ఓటు ద్వారా చెప్పటానికి టీఆరెస్ పై ఇష్టం ఉన్నా, లేకున్నా, టీఆరెస్ ను మూకుమ్మడిగా గెలిపించారు.  ఇక్కడ చంద్రబాబు నాయుడు పొత్తు కోసం ప్రయత్నించిన నాడు కేసీఆర్ మంచోడు, విఙ్జుడు. ఇప్పుడు వారి కల చెదర గానే నేడు కేసీఆర్ నీచుడు. తెలుగు ప్రజా ద్రోహి.

Image result for akhilesh maya mamata

ఇంత పెద్ద పోటోలో కూడా చంద్రబాబు లేరు! అదీ జాతీయ రాజక్రీయాల్లో ఆయన ప్రభ - ఆయన పూసుకోవాలే గాని ఆయన్ని ఎవరూ పూసుకోరు - అక్కడ ఆయన నామ మాత్రమే! 

Image result for telugu media supports chandrababu
నిష్కృయాపరత్వంతో అటు టిడిపికి దాని అధినేత చంద్రబాబుకు చివరకు టిడిపి పాద సేవలతో పూనీతమయ్యే పచ్చ పత్రికలు, కొన్ని పచ్చ చానళ్లు అంతా ఏకమై  దానికి ఎలాంటి సంభంధం లేని వైసిపి ని ఉచ్చులోకి లాగి కలవరపరచాలని అనుకుంటుంది. అయితే, అది నెఱవేరక పోగా, టీఆరెస్-వైసిపి కలిస్తే తప్పేంటనే, వాదన కు బలం విస్తృతంగా చేకూరుతుంది ప్రజల్లో. ఇది టీడీపీకి చావుదెబ్బే!

Image result for telugu media supports chandrababu

చంద్రబాబు చేసే తింగిరి ప్రయోగాలను తెలుగుప్రజలే కాదు దేశం మొత్తం వినోదంగా చూస్తుంది. తెలుగుదేశం పార్టీ గంపగుత్త విమర్శలు, స్పందనలు, నడత, నడవడి దాని మీడియా తానా తందానా విధానాన్ని  పాతివ్రత్యం లేని పాత్రికేయత ను  కాని ఖర్చులేని వినోదంగా ఒక జోకింగ్-స్టాక్ గా, ఎగతాళిగా  చూస్తున్నారు.
Image result for chandrababu vemuri radhakrishna
దీనికి ఋజువు గా మొన్న ప్రతిపక్షాల ఐఖ్యత కోసం చంద్రబాబు చక్రం తిప్పుతాడంటూ పచ్చమీడియా పిచ్చి వ్యాసాంగాన్ని తిప్పికొడుతూ - కాంగ్రెస్ ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశంలోనే బిజెపి కాంగ్రెస్ తరవాత అతి పెద్ద రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీ లైన బహుజన సమాజ్ వాదీ పార్టీ,  సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ పార్టీ అధినేతలు రాకుండా ఝలక్ ఇవ్వటం - ఇటు నారా చంద్రబాబు నాయుడికి - అటు రాహుల్ కు పట్టాభిషేకం చేయాలని కుతూహల పడుతున్న ఎంకే స్టాలిన్ కు లాగి లెంపకాయ కొట్టినట్లైంది.  

Image result for paccha political journalism its charactor in telugu states due to chandrababu

ఇలా కేసీఆర్ విషయంలో తెలుగు దేశం ద్వంద్వ వైఖరి అదే - తాము కలవాలి అనుకుంటే కేసీఆర్ పుణ్యాత్ముడు. ఇప్పుడు తమకు గుణపాఠం చెప్పి దెబ్బ కొట్టడమే కాకుండా రేపు ఏపిలో వైసిపితో దోస్తీచేసి చంద్రబాబు "టిడిపికి రిటర్న్- గిఫ్ట్"  గా ఒక భూకంపం వచ్చే ఝలక్ యివ్వనున్నాడు కాబట్టి పాపాత్ముడు! ఇదీ టీడీపీ తీరు.  ఓవరాల్ గా టిడిపికి దాని బిజేపి వ్యతిరేఖ ప్రతిపక్ష ఐఖ్యతకు బలమైన షాక్ ఇచ్చింది భారత దేశం మొత్తం.  

మరింత సమాచారం తెలుసుకోండి: