కొన్నిసార్లు అనుకోని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అనుకోకుండా చేసే కొన్ని పొరపాట్లు చాలా సమస్యలే తీసుకొస్తుంటాయి. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి చిక్కుల్లోనే పడ్డారు. కేవలం పవన్ కల్యాణ్ కు మాత్రమే కాదు.. ఆయన్ను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్ సైతం ఈ కామెంట్స్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక సినిమా నటుడిగా ఆయన మాట్లాడి ఉంటే ఏదో పొరపాటు పడ్డారులే అనుకోవచ్చు. కానీ ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడు. ఓ పార్టీకి అధినేత. పైగా మాస్ ఇమేజ్ మెండుగా ఉన్న సినీ పొలిటికల్ హీరో.

Image result for pawan kalyan on bhagat singh

పవన్ కల్యాణ్ ఎప్పుడు, ఎక్కడ, ఏం మాట్లాడినా దానికోసం కోట్లాదిమంది ఎదురు చూస్తుంటారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన వేసే ప్రతి అడుగునూ జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. ప్రజలు కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన చెప్పే మాటలను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడ పర్యటించినా అక్కడ ప్రస్తావించే అంశాలు, ఆయా సమస్యలపై ఆయన రెస్పాండ్ అవుతున్న తీరును అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏది మాట్లాడినా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.

Image result for pawan kalyan on bhagat singh

తాజాగా అమెరికా పర్యటనలో పవన్ కల్యామ్ భగత్ సింగ్ పై చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. కేవలం 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారంటూ పవన్ చేసిన వ్యాక్యలు చాలా మందిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఇదేంటి.. పవన్ ఇలా అనేశారు.. తెలిసి అన్నారా.. లేకు తెలియక మాట్లాడేశారా.. అనే కామెంట్స్ ఇప్పుడు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. సోషల్ మిడియాలో పవన్ కల్యాణ్ ను వెనకేసుకొచ్చేందుకు ఆయన ఫ్యాన్స్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే మాట జారాక దాన్నివెనక్కు తీసుకోవడం అంత ఈజీ కాదుగా.!

Image result for pawan kalyan on bhagat singh

దేశంకోసం ప్రాణాలర్పించిన వారి పేర్లు పవన్ కల్యాణ్ ప్రస్తావించడం ఇది తొలిసారి కాదు. చాలా సభల్లో ఆయన భగత్ సింగ్, నేతాజీ, ఆజాద్ లాంటి వారి పేర్లను ప్రస్తావించేవారు. వారి స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చేవారు. అదే కోవలోనే తాజాగా భగత్ సింగ్ పేరు ప్రస్తావించారు. వాస్తవానికి బ్రిటీష్ వారి తూటాలకు బలవడం ఇష్టం లేక తనను తాను కాల్చుకుని ఆత్మార్పణం చేసుకున్న గొప్ప వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్.! ఆజాద్ పేరును ప్రస్తావించబోయి భగత్ సింగ్ పేరు ప్రస్తావించారు పవన్ కల్యాణ్. కానీ ఈ ఒక్క పొరపాటు పవన్ కల్యాణ్ ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ గా మార్చేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: