నాయకులన్న తరువాత ఒట్టి చేతులతో రాకూడదు. జనం కూడా అలా కోరుకోరు. ఇక హామీలు ఇచ్చి నెరవెర్చ‌ని నాయకుల  విషయంలోనూ జనం విముఖంగా ఉంటారు. మరి అన్నీ తెలిసి దేశానికే పెద్దాయన ఏపీకి వచ్చి ఏ సాధిస్తారు. జనం  ఎలా స్పందిస్తారు అన్న చర్చ ఇపుడు సాగుతోంది.


మూడున్నరేళ్ళ తరువాత :


ప్రధాని నరేంద్ర మోడీ మూడున్నరేళ్ల తరువాత ఏపీకి వస్తున్నారు. 2015 దసరా వేళ అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ మట్టి నీళ్ళు తెచ్చారు. దాని మీద ఇప్పటికీ టీడీపీతో సహా ప్రజలంతా దెప్పుతూనే ఉన్నారు. ఈ మధ్యలో ప్రత్యేక హోదాను విజయవంతంగా  అటకెక్కించేశారు. రాజధానికి నిధులు సరిగా లేవు. పోలవరం విషయంలూనూ అంతే. ఈ టైంలో మోడీ ఏపీకి వస్తున్నారు.


ఏం చెబుతారు:


ప్రధాని మోడీ జనవరి 6న గుంటూరు జిల్లాకు వస్తున్నారు. ఆ రోజున ఆయన భారీ సభ నిర్వహించి అన్ని విషయాలు జనాలకు చెబుతారని ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. కేంద్రం ఏపీకి ఎంతో సాయం చేసిందని, దాన్ని ప్రధాని ప్రజలకు వివరిస్తారని అంటున్నారు. నిజానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇలా చాలా హామీలు తప్పిన కేంద్రంపై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు.
అటువంటిది మోడీ వచ్చి చెబితే జనం వింటారా అన్న చర్చ సాగుతోంది. ప్రత్యేక హోదా సెంటిమెంట్ గా మారిన తరుణంలో ప్రధాని ఎన్ని రకాలుగా చెప్పినా జనం మాత్రం వింటారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: