ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని టీయారెస్ అధినేత కేసీయార్ ప్రకటించిన తరువాత ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో సమీకరణలు మారుతున్నాయి. కేసీయార్ వంటి బిగ్ పొలిటికల్ ఫిగర్ దన్ను ఉంటే ఏపీలో ఎన్నికల గోదారిని ఈదేయగలమని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.


అయిదు జిల్లాలో ప్రభావం :


కేసీయార్ వెలమ సామాజిక వర్గం ఏపీలో అయిదు జిల్లాల్లో ఉంది. ఈ సామాజిక వర్గం మెజారిటీ ఇపుడు టీడీపీలో ఉంది. ఎపుడైతే కేసీయార్, బాబు రాజకీయ శత్రువులు అయ్యారో అపుడే ఈ వర్గంలోనూ మార్పు కనిపిస్తోంది. అక్కడ తెలంగాణాలో టీయారెస్ అఖండ విజయం సాధించిన తరువాత ఇక్కడ ప్రతీ చోటా వెలమలు సంబరాలు చేసుకున్నారు. దానికి తోడు ఏపీలోనూ కేసీయార్ రావాలని, ఆ పార్టీ పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర సమితిని ఏర్పాటు చేస్తామని కూడా చెబుతున్నారు.


జగన్, పవన్ :


ఇక ఏపీలో బాబుని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్న వారిలో జగన్, పవ్న ఉన్నారు. అయితే మొన్న కేటీయార్ మీట్ ది ప్రెస్ లో మాత్రం ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. మరి ఆ బలమైన ప్రాంతీయ పార్టీ ఏమిటన్నది ఇక్కడ చర్చగా ఉంది. మరో వైపు జగన్ సీఎం అవుతారంటూ టీయారెస్ లోని మాజీ హోం మంత్రి నాయని నరసిమ్హారెడ్డి వంటి వారు చెప్పడం, అలాగే టీయారెస్ మిత్ర పక్షం మజ్లిస్ సైతం జగనే కాబోయే సీం అని, ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తామని అనడం వంటివి పరిగణనలోకి తీసుకుంటే జగన్ కే టీయారెస్ మద్దతు ఉంటుందని అంటున్నారు.


దాంతో జనసేన నాయకుల్లో టెన్షన్ పెరుగుతోందంట. కేసీయర్ పార్టీలో దోస్తీ కట్టిన జనసేన ఏపీలో తమకు మద్దతు ఉంటుందని గట్టిగా ఆశిస్తోంది. మరి ఇప్పటికి బయటపడకపోయినా టీయారెస్ కనుక వైసీపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే జనసేనకు షాక్ లాంటిదేనని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: