తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది..అందుకు మద్దతుగా ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ సమ్మతం తెలిపింది.  ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఏపికి ప్రత్యేక హోదా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పైగా ఆ మద్య అసలు ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.  అప్పటి నుండి మిత్ర పక్షంగా ఉంటున్న టీడీపి ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. 

ఏపి ప్రత్యేక హోదా ఇవ్వాలని పోరాటం చేస్తుంది.  ఈ నేపథ్యంలో పార్లమెంట్ వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఏపికి ప్రత్యేక హోదా కావాలని చిత్తూరు ఎంపి, సినీ నటుడు శివప్రసాద్ రక రకాల వేష దారణలతో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటి వరకు ఆయన ఎన్నో రకాల వేషాలు వేసుకొని పార్లమెంట్ వద్ద నిరసన తెలుపుతూ వస్తున్నారు.  తాజాగా  ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు వేషం ధరించిన టీడీపీ నేత ఎన్.శివప్రసాద్, మోదీ ప్రభుత్వ తీరును పాట రూపంలో తూర్పారపట్టారు.
Image result for modi
‘ఏం పిల్లడో ఢిల్లీ వస్తవా.. ఏం అమ్మాయి ఢిల్లీ వస్తవా.
ఢిల్లీలోనే మొండోడు(ప్రధాని మోదీ) ఉన్నడు.
 మొండోడిని కాదు.. నేను మొనగాడిని అంటడు.
డ్రస్సులేమో తెగ జోరుగా ఏస్తడు.
ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటడు.
త్రీడీ ఎఫెక్టుతో ప్రధాని అయ్యుండు.
ప్రజల గురించి అసలు ఆలోచించడు’

ప్రత్యేకహోదా నుంచి ప్యాకేజీకి దిగజారిన మోదీ, ప్యాకేజీని తర్వాత లీకేజీ చేశాడని శివప్రసాద్ ఆరోపించారు.  అంతే కాదు గతంలో ఆంధ్రప్రదేశ్ లో అమరావతి శంకుస్థాపన సందర్భంగా చెంబు నీళ్లు, తట్టెడు మట్టి ముఖాన కొట్టారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్, శివప్రసాద్, రామ్మోహన్ నాయుడు, మురళీ మోహన్ సహా పలువురు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. 2019లో మోదీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: