2019 ఎన్నికలు దగ్గర పడుతుండటం తో చంద్ర బాబు ఎమ్మెల్యేల పని తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు . నలభైమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో బ్యాడ్ రిపోర్ట్ అందినట్టుగా చంద్రబాబు నాయుడు ఆ సమావేశాల్లో వ్యాఖ్యానిస్తూ వచ్చారు. అయితే ఆ నలభై కాస్తా ఇప్పుడు పాతిక అయ్యింది. పాతికమంది ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడట.

Image result for chandra babu

వాళ్లను మార్చాలా వద్దా అనే అంశం గురించి తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం అనుకూల పత్రికలే చెబుతున్నాయి. ఈ విషయంలో పక్క రాష్ట్రాలను ఉదాహరణగా తీసుకుంటోందట టీడీపీ. ఇటీవల కేసీఆర్ మొత్తం సిట్టింగులతోనే వెళ్లి ఘనవిజయం సాధించాడు. కేసీఆర్ పాలనతో ఆయన మీద వ్యతిరేకత లేదని, ఆయన పార్టీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగింది.

Image result for chandra babu

అయినప్పటికీ కేసీఆర్ సిట్టింగులను పెద్దగా మార్చలేదు. ఆ మార్చకపోవడమే కేసీఆర్ ను దెబ్బతీస్తుందని విశ్లేషకులు చెబుతూ వచ్చారు. అయితే వారి అంచనాలు తలకిందుల అయ్యాయి. తన ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు అని చెప్పుకోవడానికి అన్నట్టుగా కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే ఎన్నికలకు వెళ్లాడు ఘన విజయం సాధించాడు. కేసీఆర్ లాగా తామూ గెలుస్తామనే టీడీపీకి మాత్రం సిట్టింగులకే టికెట్ ఇవ్వడానికి ధైర్యంలేదట. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగులకు టికెట్లను ఇచ్చి ఓడిపోయిందని.. అలా అవుతుందేమో అని టీడీపీలో చర్చ జరుగుతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: