సర్వమతాల సమాహారానికి ప్రతిరూపమైన భాగ్యనగరం క్రిస్మస్ సంబరాలకు ముస్తాబవుతోంది. నిన్నమొన్నటివరకూ ఎన్నికలతో బిజీబిజీగా ఉండిపోయిన హైదరాబాద్ ఇప్పుడు సరికొత్త జోష్ కు సిద్ధమవుతోంది. క్రిస్మస్, న్యూయర్ సందడి నగరంలో మొదలైపోయింది..

 Image result for christmas shopping in hyderabad

హైదరాబాద్ లోని షాపింగ్ మాల్స్ అన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకుంటూ ఉండడంతో వినియోగదారులు షాపింగ్ మాల్స్ వైపు పరుగులు పెడుతున్నారు. క్రిస్మస్ తాతయ్య శాంతాక్లాజ్ పిల్లలకిచ్చేందుకు వీలుగా పలు రకాల గిఫ్ట్ లు  మార్కెట్లో సిద్ధంగా వున్నాయి. వేడుకలకు స్వాగతం పలికే చక్కని బోర్డులతోపాటు రంగురంగుల బెలూన్లు, స్టార్లు, క్రిస్మస్ ట్రీలు వీధుల్లో నిండిపోయాయి. క్రిస్మస్ ట్రీలను అందంగా అలంకరించేందుకోసం బ్యూటిఫుల్ డెకొరేటివ్ ఐటెమ్స్ మార్కెట్ ను ముంచెత్తాయి. ఇంటి వాతావరణాన్ని ఒక్కసారిగా పండగ శోభతో నింపడానికి అవసరమైన అన్ని రకాల ఐటమ్స్ ఇప్పుడు మార్కెట్‌లో మెరిసిపోతున్నాయి.

 Image result for christmas shopping in hyderabad

ఇక నగరంలో క్రిస్మస్ సంబరాల సన్నాహకాల్లో భాగంగా కేక్ మిక్సింగ్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు హోటళ్లలో కేక్ మిక్సింగ్ ఈవెంట్స్ అట్టహాసంగా జరిగాయి. షాపింగ్ మాల్స్ లో కూడా క్రిస్మస్ ఈవెంట్స్ ఈసారి స్పెషాలిటీ.! ఆఫర్స్ తో పాటు కేక్ కటింగ్స్ కూడా అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఈ ఈవెంట్స్ కు సినిమా స్టార్స్ కూడా గెస్ట్ లుగా వస్తున్నారు. దీంతో షాపింగ్ మాల్స్ లో సందడి నెలకొంది.

 Image result for christmas shopping in hyderabad

ఏటా క్రిస్మ‌స్ పండుగకు షాపింగ్ చేయ‌డం, గిఫ్టులు కొన‌డం చాలా కామన్. అందుకోసం పెద్దఎత్తున వినియోగదారులు బహుమతులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాక.. ఇరుగు పొరుగు వారికి, బంధువుల‌కు, స్నేహితుల‌కు బహుమతులు ఇవ్వడం క్రిస్మస్ స్పెషాలిటీ.! గతేడాది కంటే ఈసారి ఎక్కువ షాపింగ్ కోసం ఖర్చు చేస్తున్నట్టు షాపింగ్ మాల్స్ యజమానులు చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: