ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశంలోనే సీనియర్ని అని బాబు పదే పదే చెప్పుకుంటారు. తన ముందు మోడీయే జూనియర్ అంటూంటారు. అటువంటి బాబుకు జగన్ తో పోలికా అని స్వయంగా తమ్ముళ్ళే అంటూంటారు. మాటకొస్తే 40 యియర్స్ ఇండస్ట్రి  అంటూ చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తూంటారు. అటువంటి బాబు గారికి యువ నేత, తన కంటే బాగా జూనియర్ జగన్ తో పోలికేంటి.


జగనూ వెళ్ళలేదుగా:


చంద్రబాబు తీరు ఎలా ఉందంటే తనని సమర్ధించుకోవడానికి జగన్ తో పోలిక తెస్తున్నారు. ఓ పక్కన ఏపీపై బలమైన పంజా విసిరి  పెను ముప్పులా దూసుకువస్తున్న పెథాయ్ తుపాన్ దూసుకువస్తున్న వేళ చంద్రబాబు ఉన్నది ఏపీలో కాదు, ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యామంత్రుల ప్రమాణ స్వీకారం వేదికలపైన. విమానాల్లో, బస్సులో మిగిలిన నాయకులతో ఒక చోట నుంచి మరో చోటకు  వెళ్తూ కులాసా కబుర్లలో బాబు మునిగితేరారు. అద్రుష్ఠం బాగుండి పెథాయ్ తుపాను తక్కువ నష్టంతో ఏపీ నుంచి వెళ్ళిపోయింది కానీ అదే హుదూద్ లాగో, తితిలీ మాదిరిగానో తిరగబడితోఅ ఏపీ గతేంకాను.. అదే ఇపుడు విపక్షాలు బాబుపై విమర్శలు చేస్తున్నాయి. 


ఏపీలో తుపాను ఉంటే కాంగ్రెస్ తో కరచాలనానికి బాబు ఎగబడి వెళ్ళడం దారుణమంటూ విపక్ష నేతలు  ఘాటు కామెంట్స్ చేశారు. మరి దీనిపై  కరెక్ట్ గా స్పందించాల్సిన బాబు యధా ప్రకారం ఎదురుదాడిని స్టార్ట్ చేశారు. నేను ఇక్కడ లేనని అంటున్నారు, మరి జగన్ తిత్లీ తుపాన్ టైంలో ఏం చేస్తున్నాడు, పక్కనే జిల్లాలో ఉండి కూడా పరామర్శకు రాలేదంటూ బాబు విరుచుకుపడుతున్నారు. అది నిజమే కానీ జగన్ ఏమీ సీఎం కాదు కదా, పైగా ఆయన వస్తే అక్కడ ఒరిగేది కూడా ఏమీ ఉండదన్న సంగతి బాబు వంటి వారికి తెలియదా.


 సీఎం గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి పెను తుపాను విలయతాండవం చేస్తూంటే  రాష్ట్రాన్ని గాలికొదిలేసి  వెళ్లిపోయారని ప్రతిపక్షాలతో పాటు జనమూ అనుకుంటున్నారు. కానీ బాబు మాతం ఇపుడు తన కంటే జూనియర్ అయిన జగన్ తో పోలిక పెట్టుకుంటూ ఈ నిందనుంచి తప్పించుకోవాలనుకుంటున్నారని సెటైర్లు పడుతున్నాయి. అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు ఇలా చేయవచ్చునా అంటూ కౌంటర్లూ పడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: