దయ ఎలా ఉంటుంది. కరుణకు రూపం ఏంటి, మనిషిలో దైవత్వం ఏ ఈతీరున ఆవిష్క్రుతమవుతుంది. సామాన్యుడు అసమాన్యుడు ఎలా అవుతాడు. వెలుగు  బావుటా ఏ రీతిన ప్రజ్వరిల్లుతుంది. వీటన్నిటికీ సమాధానమే ఏసు ప్రభువు. చీకటి లోనుంచి కొత్త కాంతులను అందించగల దివ్య పురుషుడు. యుగ పురుషుడు. ఏసుకు ముందు తరువాత అన్నంతగా కాలాన్ని అడ్డంగా విడదీసి అంతా తానే అయిన నవ శకానికి నాయకుడు.


పసువుల పాకలో పుట్టిన పసిడి కిరణం ఏసు. పుడమి తల్లి భారన్ని దించి నవ్వులు పూయించడానికి ఇలపై వెలసిన దివ్య కాంతి ఆ దైవ కుమారుడు. సైతానులను తన కంటి చూపుతో శాసించి పాపులను సైతం క్షమించగలిగిన మానవతామూర్తి. లోకంలో ఎపుడు ప్రేమ సంపూర్ణంగా ఉండాలని, అదే పండు వెన్నెలకు ఎల్లెడలా ప్రసరింపచేయాలని తలచి అందుకోసం తన జీవితాన్ని అంకితం చేసిన దైవ సుతుడు అతడు.


నేనే మార్గం, జీవం సత్యమని చాటి చెప్పిన ఏసు దేవుడు పుట్టిన రోజు అభాగ్యులందరికీ పండుగ రోజు. ఓ ఏసయ్య నీవే శరణమయ్య అంటే తప్పక ఆదుకునే దయాగుణ సంపన్నుడు కాబట్టే యుగాలకు సైతం చెక్కుచెదరని కీర్తికాయంతో సదా ప్రకాశిస్తున్నాడు. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడని, ఆ దైవాన్ని దయ గల హ్రుదయమే దర్శించగలదని చాటి చెప్పిన ప్రవక్త ఏసు. క్రిస్మస్ వేడుక అంటే ఇదే అర్ధం. ఇదే పరమార్ధం. ఈ నీతిన, ఈ రీతిన మానవాళీ మనగలిగినపుడే క్రిస్మస్ కాంతులు యావత్తు  విశ్వంలో నిండిపోయి సరికొత్త దైవ శకాన్ని ఆవిష్కరిస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: