పార్టీ ఫిరాయింపులపై ముఖ్యమంత్రి కెసియార్ దృష్టి పెట్టారు.  ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ కు చెందిన నలుగురు శాసనమండలి సభ్యులు టిఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి దూకిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు మంచి పట్టుమీదున్నపుడు నలుగురు ఎంఎల్సీలు కొండా మురళి, రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డి కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. వారందరిపై చర్యలు తీసుకోవాలని అధికార టిఆర్ఎస్ నిర్ణయించింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా ? అన్నట్లుగా కెసియార్ తలచుకోగానే శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ వెంటనే పై నలుగురికి నోటీసులు జారీ చేశారు.

 Image result for konda murali

పై నలుగురి పదవీ కాలం ఎంతుందన్నది కాదు సమస్య. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారా లేదా అన్నదే ప్రధాన సమస్య. తాజాగా కౌన్సిల్ ఛైర్మన్ ఇచ్చిన నోటీసులతో వారం తర్వాత నలుగురిపై చర్యలు తప్పవని తేలిపోయింది. ఇఫుడు అధికారంలోకి ఉన్నారు కాబట్టి నలుగురు కౌన్సిల్ సభ్యులపై ఏ విధమైన చర్యలు తీసుకున్నా అడిగే వారు కూడా ఉండరు. పోయిన ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కెసియార్.

Image result for mlc bhupathi reddy

బొటాబొటిగా వచ్చిన మెజారిటీతో ప్రభుత్వాన్ని నడపటం కష్టమని భావించిన కెసియార్ టిడిపి, కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేశారు. ఎవరికి కావాల్సిన సర్దుబాటు వారికి చేయటంతో చాలామంది ఎంఎల్ఏలు టిఆర్ఎస్ లో చేరిపోయారు నిర్లజ్జగా. ఎంఎల్ఏల ఫిరాయింపులపై కాంగ్రెస్, టిడిపిలు పెద్ద స్దాయిలోనే పోరాటం చేసినా ఉపయోగం లేకపోయింది. న్యాయస్ధానాలను కూడా కెసియార్ లెక్క చేయలేదు. దాంతో ఎవరూ ఏమీ చేయలేక నోరుమూసుకు కూర్చున్నారు. అటువంటి కెసియార్ ఇపుడు టిఆర్ఎస్ లో నుండి ఫిరాయించిన ఎంఎల్సీలకు కౌన్సిల్ ఛైర్మన్ ద్వారా నోటీసులు ఇప్పించటమే విచిత్రంగా ఉంది.

Image result for mlc yadava reddy

కౌన్సిల్ ఛైర్మన్ నుండి ఎంఎల్సీలకు నోటీసులు అందాయంటేనే కెసియార్ ఆదేశాలు లేందే జరిగే పనికాదన్న విషయం అందరకీ తెలుసు. కెసియార్ వైఖరి ఎలాగుందంటే తాను చేస్తేనే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్లుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కాంగ్రెస్, టిడిపిల నుండి గెలిచిన ఎంఎల్ఏలను టిఆర్ఎస్ లోకి లాక్కునేందుకు కెసియార్ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతుండటమే కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: