నిన్న కాక మొన్న పార్టీ పీట్టిన వారికే ఎన్నో తెలివితేటలు ఉంటే శతాబ్దం పైగా కాలాన్ని మింగేసిన గ్రాంద్ ఓల్డ్ పార్టీకి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. అందుకే కాంగ్రెస్ ఇపుడు తనదైన ఆలొచనలకు పదును పెడుతోంది. వచ్చె ఎన్నికల్లో ఎలాగైనా డిల్లీ పీఠం పట్టేసేందుకు అవసరమైన వ్యూహాలను రచిస్తోంది.


ఏపీలో కొత్త వ్యూహమా :


తెలంగాణా ఎన్నికల ఫలితాలు కాదు కానీ అన్ని పార్టీలు దాని ఆధారంగా చేసుకుని కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక అక్కడ కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఫెయిల్ కావడంతో ఇపుదు ఏపీ కాంగ్రెస్ నేతల స్వరాల్లో మార్పు వచ్చేసింది. సైకిల్ దిగిపోదామని  అంటున్న వారి గొంతు బాగా బలపడుతోంది. సొంతంగా పోటీ చేద్దామని ఏకంగా అధినాయకత్వానికే విన్నపాలు చేస్తున్నారట. దీనిపైన మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో అభిప్రాయ సేకరణ చేస్తే ఎక్కువమంది పార్తీవాదులు సొంతంగా పోటీకి సై అన్నారట.


ఆప్షన్లు ఉంటాయి :


సొంతంగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ బలపడుతుందని, అదే సమయంలో ఏపీలో రేపు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ సాయం ఎన్నికల అనంతం తీసుకోవడం మంచి వ్యూహం అవుతుందని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారట. ఏపీలో చూడబోతే టీడీపీకి విజయావకాశాలు అంతగా లేవని, ఆ పార్టీతో జట్టు కట్టి మునగడం కంటే ఒంటరిగా బరిలోకి ఉంటేనే ఆప్షన్లు ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ ఏపీ నేతలు భావిస్తున్నారట. 

రేపటి రోజున వైసీపెకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినా ఆ పార్టీని కలుపుకుని పోవడానికి వీలు అవుతుందని కూడా ఆలోచిస్తున్నారట. అదే టీడీపీతో ముందస్తు పొత్తులు ఉంటే జగన్ మద్దతు ఇచ్చేందుకు వెనక్కు పోతారని కాంగ్రెస్ లోని కొంతమంది అభిప్రాయపడుతున్నారట. ఇదిలా ఉండగా ఏపీలో పొత్తుల వ్యవహరాల‌ పై చర్చించేందుకు ఈ నెల 25న రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ ఇంచర్జి ఉమన్ చాందీ మీట్ అవుతున్నారు. ఆ తరువాత ఏపీలో కాంగ్రెస్ పోటీపై ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: