అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విజ్ఞానం చిన్నవాళ్లను కూడా తప్పుదోవ పట్టిస్తోంది. 8వ తరగతి చదువుతున్న ఓ 12 ఏళ్ల పిల్లవాడి ట్యాబులో ఏకంగా 3 వేలకుపైగా నగ్న వీడియోలు, చిత్రాలు లభించడం హైదరాబాద్ మాదాపూర్ లో కలకలం సృష్టిస్తోంది. హైటెక్ సిటీ సమీపంలోని ఓ లేడీస్ హాస్టల్ యువతుల ఫిర్యాదులో ఈ చిత్రమైన విషయం వెలుగు చూసింది.

Image result for BATHROOM  VIDEOS WATCHING


అసలు ఏంజరిగిందేటే.. హైటెక్ సిటీలో ఓ లేడీస్ హాస్టల్ ఉంది. అక్కడ చాలామంది ఉద్యోగం చేసే యువతులు, విద్యార్థినులు ఉంటుంటారు. ఆ హాస్టల్ పక్కనే ఉండే ఇంట్లో పై అంతస్తులో ఓ కుటుంబం ఉంటోంది. 8 వ తరగతి చదివే కుర్రాడికి తల్లిదండ్రులు ట్యాబ్ కొనిచ్చారు. ఆ పిల్లవాడు దాంతో పక్క హాస్టల్ బాత్రూమ్ కిటికీ నుంచి అమ్మాయిలు స్నానం చేసే దృశ్యాలు చూసేవాడు.

Image result for BATHROOM  VIDEOS WATCHING

అంతటితో ఆగకుండా తన దగ్గరున్న ట్యాబ్ తో వాడిని షూట్ చేయడం ప్రారభించాడు. ఈ నెల 16న ఓ యువతి స్నానం చేస్తూ కిటికీ దగ్గర సవ్వడి కావడంతో అప్రమత్తమైంది. గభాలున చూడగా పక్కింటి బాల్కనీ నుంచి ఓ బాలుడు ట్యాబ్‌తో పరుగులు తీయడం కనిపెట్టింది. హాస్టల్‌ నిర్వాహకులకు జరిగిన విషయం చెప్పింది.

Image result for BATHROOM  VIDEOS WATCHING


వాళ్లు ఆ పిల్లవాడిని నిలదీయగా అసలు విషయం చెప్పాడు. ఆ ట్యాబ్‌ ఓపెన్ చేసి చూస్తే అందులో 3000 కు పైగా నగ్న చిత్రాలు, వీడియోలు ఉన్నాయి. దీంతో ఈ కుర్రాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారుపోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని ట్యాబ్‌ను పరిశీలించారు. ఈ వీడియోలు పిల్లవాడు మాత్రమే చూశాడా.. ఎవరికైనా పంపాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: