పెథాయ్ తుపాను.. వచ్చింది.. కాస్త కనికరించి చూపించి ముందుగా అనుకున్నంత తీవ్రంగా కాకుండా కాస్త నెమ్మిదించి తీరం దాటింది. అయితే పైథాయ్ తుపాను రాకడ, సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు ఓ కొత్త వాదన తీసుకొస్తున్నారు. సాధారణంగా తుపానుల రాక, తీవ్రత, ప్రయాణం గురించి భారత వాతారవణ శాఖ చెబుతుంటుంది. దానికి ప్రత్యేక యంత్రాంగం ఉంది.

Image result for pethai rtgs


ఐతే.. రాష్ట్రప్రభుత్వం ఐఎండీపై ఆధారపడకుండా తన సొంత యంత్రాంగాన్ని ఏర్పరచుకుందట. ఇస్రోతో చేసుకున్న ఒప్పందం మేరకు ఆర్టీజీఎస్ యంత్రాంగమే తుపాను రాక, ప్రయాణం, తీవ్రతలను విశ్లేషిస్తోందట. ఆర్టీజీఎస్ ఇచ్చే సమాచారం ఐఎండీ ఇచ్చే సమాచారం కంటే కచ్చితంగా ఉంటోందట. అంటే.. భారత వాతావరణ శాఖ కంటే ఏపీ వద్ద ఉన్న టెక్నాలజీనే గొప్పదని చంద్రబాబు మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.

Image result for pethai rtgs


ఇస్రోతో కలిసి ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చానని చంద్రబాబు చెప్పారు. తాను తెచ్చిన అవేర్‌ వ్యవస్థ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందన్నారు. పెథాయ్‌ తుపాను కాకినాడ – ఒంగోలు మధ్య తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేయగా, తాను తెచ్చిన టెక్నాలజీ యానాం – తుని మధ్య అని చెప్పగలిగిందని చంద్రబాబు అంటున్నారు.

Image result for pethai rtgs


అంతే కాదు... భవిష్యత్తులో తుపాన్లు ఎప్పుడు వస్తాయి? వాటి తీవ్రత ఎలా ఉండబోతుంది? ఎక్కడ తీరం దాటుతుందో కూడా చెబుతారట. ఎన్ని చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, ఇళ్లు కూలిపోతాయి? ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఏ మేరకు నష్టం వాటిల్లబోతుందో చెప్పేస్థాయిలో టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారట. ఏదేమైనా ఇదే నిజమైతే.. చంద్రబాబు రియల్లీ గ్రేట్. ప్రతి దానికి ఎవరిపైనో ఆధారపడకుండా స్వంతంత్ర్య వ్యవస్థను రూపొందించినందుకు ఆయన్ని అభినందించాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: