సినిమా ఫంక్షన్ లో కొన్ని సార్లు ఒకరిని పొగడబోయి వివాదం లోకి ఇర్రుకుంటారు . అయితే అంతరిక్షం ప్రీరిలీజ్ ఫంక్షన్లో ముగ్గురు దర్శకులను ఆకాశానికెత్తేశాడు చరణ్. తెలుగు ఇండస్ట్రీలో గొప్ప ఆలోచనలతో కూడిన దర్శకులు రాజమౌళి, సుకుమార్, క్రిష్ అని అన్నాడు. అలాంటి కోవలోకి అంతరిక్షం డైరెక్టర్ సంకల్ప్ రావాలని ఆకాంక్షించాడు. అంతవరకు బాగానే ఉంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు ఆ ముగ్గురేనా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Image result for ram charan

సహజంగా తన సినిమాకు పనిచేస్తున్నవాళ్లని, తాను కలిసి పనిచేయాలనుకుంటున్న వాళ్లని మాత్రమే సినిమావాళ్లు ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు.చరణ్ మాటల వెనక కూడా ఇదే ఫార్ములా ఉంది. రంగస్థలంతో తనకు సూపర్ హిట్ ఇచ్చాడు కాబట్టి సుకుమార్ గొప్ప దర్శకుడు, గతంలో మగధీర చేశాడు, ఇప్పుడు ఆర్-ఆర్-ఆర్ చేస్తున్నాడు కాబట్టి రాజమౌళికి గొప్ప ఆలోచనలున్నాయి.

సంచలనంగా మారుతున్న చరణ్ వ్యాఖ్యలు

ఇక స్టేజ్ పై క్రిష్ ఉన్నాడు, గతంలో తమ్ముడు వరుణ్ తో కంచె తీశాడు కాబట్టి అతడు కూడా గొప్ప దర్శకుడే. ఇలా గొప్ప ఆలోచనలున్న దర్శకులు అంటూ ఈ ముగ్గురి పేర్లను మాత్రమే చెప్పడంలో చరణ్ ఆంతర్యమేంటో తెలియడం లేదు. నిన్నటితరం దర్శకులు రామ్ చరణ్ కు గుర్తులేకపోవచ్చు, కనీసం సమకాలీన దర్శకుల గురించి చెప్పాలన్నా చాలామందే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. వారిపేర్లు చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ, 'గొప్ప ఆలోచనలున్న దర్శకులు' అనే క్రెడిబిలిటీని కేవలం ఈ ముగ్గురికి పరిమితం చేయడమే ఇప్పుడు చర్చకు తావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: