తన అక్క అయినా సుహాసిని ఎన్నికల బరిలోకి దిగిన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ప్రచారం చేయలేదు . అయితే  తారక్ తన ఫ్యామిలీ కోసమైనా పంతం వీడి వస్తారనుకున్నారు. కానీ ఎంత ఒత్తిడి వచ్చినా ఎన్టీఆర్ ప్రచారానికి రాలేదు. కానీ ఎన్టీఆర్ నిర్ణయమే కరెక్ట్ డెసిషన్ అని చివరకు తేలింది. కూకట్ పల్లి లో సుహాసిని ఓడిపోయింది.అక్క ఓడిపోతుందని తారక్ కు ముందే తెలిసి ప్రచారానికి రాలేదని సమాచారం.

Image result for ntr

ఎన్టీఆర్ కు అత్యంత ఆప్తుడైన ఒక మిత్రుడు సర్వే చేసి కూకట్ పల్లిలో సుహాసిని గెలువదని ఎన్టీఆర్ కు నివేదిక ఇచ్చాడట.. టీడీపీ తరుఫున ఎన్టీఆర్ ప్రచారం చేస్తే  తెలంగాణ అభిమానులు కూడా హర్ట్ అయ్యే అవకాశం ఉందని.. చంద్రబాబు అవకాశావద రాజకీయాలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ కు సలహా ఇచ్చాడట.. అక్క కోసం ప్రచారానికి వెళ్లినా ప్రయోజనం ఉండదని స్నేహితుడు ఖచ్చితంగా చెప్పాడట.. దీంతో ఎన్టీఆర్ తోపాటు కళ్యాణ్ రామ్ కూడా అక్క సుహాసిని తరుఫున ప్రచారానికి దూరంగా ఉన్నారు.


అయితే ఇటీవల అబ్బాయి ఎన్టీఆర్- బాబాయ్ బాలయ్యలు కలిసారు. ఎన్టీఆర్ సుహాసిని ప్రచారానికి దూరంగా ఉండడంతో బాలక్రిష్ణ సీరియస్ గా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. వీరిద్దరి మధ్య చిగురించిన సంబంధాలు సుహాసిని వల్ల తెగిపోయాయని చెబుతున్నారు.  అందుకే ఇప్పుడు రాబోయే ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఆడియో వేడుక కు ఎన్టీఆర్ ను బాలయ్య ఆహ్వానిస్తాడా లేదా అన్నదాన్ని బట్టి వీరి మధ్య సంబంధాలు అర్థమవుతాయంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: