రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రకాశం జిల్లాలో వైసిపి రివర్స్ ఆకర్ష్ ను మొదలుపెట్టిందా ? అవుననే సమాధానం వస్తోంది. రివర్స్ ఆకర్ష్ కు సూత్రదారి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డేనట. విజయసాయి కారణంగానే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి వైసిపిలో చేరారట. అలాగే మాజీ ఎంఎల్ఏ అన్నా రాంబాబు కూడా వైసిపిలో చేరనున్నారు. వీరిద్దరికి కాకుండా మరో ఐదుగురు కీలక నేతలతో విజయసాయి మాట్లాడుతున్నట్లు సమాచారం. ఇందులో ముగ్గురు టిడిపి కీలక నేతలు కూడా ఉన్నారట.

 

ఐదుగురిలో ముగ్గురికి విజయసాయి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరపున టిక్కెట్లు హామీ కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వివిధ పార్టీల్లో బలంగా ఉన్న నేతలకు, ఏ పార్టీతోను సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటున్న నేతలతో కూడా రాజ్యసభ సభ్యుడు మాట్లాడుతున్నట్లు సమాచారం. జిల్లా వ్యవహారాలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి, మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డిలు చూస్తున్నప్పటికీ విజయసాయి కూడా పై ఎత్తున పర్యవేక్షిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

తెలంగాణా ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయసాయి తన ఆపరేషన్ ఆకర్ష్ స్పీడును పెంచినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వివిధ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను వెతుకుతున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైసిపికి గట్టి అభ్యర్ధులంటే మహా అయితే 7 చోట్లుంటారు. మిగిలిన ఐదు చోట్ల బలమైన అభ్యర్ధుల కోసం వెతుకుతున్నారు. అందుకనే ఇతర పార్టీలు, వివిధ సామాజిక వర్గాల్లో బలమైన నేతల కోసం వెతుకులాట మొదలైంది. మరి విజయసాయి రివర్స్ ఆకర్ష్ పథకానికి ఎంతమంది ఆకర్షితులవుతారో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: