2019 లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల రూపంలో మరో కురుక్షేత్రం జరగబోతుంది . ఇప్పటికే అధికార పార్టీ , ప్రతి పక్ష పార్టీ తమ తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది . ఇప్పటికే అధికారం లో ఉన్న టీడీపీ పార్టీ మరో సారి ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని ప్రయత్నిస్తుంటే , ప్రతి పక్ష పార్టీ అయినా వైస్సార్సీపీ ఈ సారి 2014 లో చేసిన తప్పులను మళ్ళీ రిపీట్ చేయకూడదని ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితి లో గెలవాలని కష్ట పడుతుంది. 

Image result for jagan and chandra babu

అయితే ఇప్పటికే తెలంగాణ లో ఎన్నికలు ముగిసి పోయినాయి . తెరాస విజయ దుందుభి మోగిస్తే ప్రజా కూటమి ఓటమి ని మూట కట్టుకొని తెగ ఆలోచిస్తుంది. అయితే ఇప్పుడు అందరి కళ్ళు 2019 లో జరగబోయే ఆంధ్ర ఎన్నికల మీద పడ్డాయి . ఈ సారి హోరాహోరీ తప్పదని చాలా మంది భావిస్తున్నారు. ఇటు అధికార పార్టీ, అటు ప్రతి పక్ష పార్టీ విజయం తమదే నని ధీమా ను వ్యక్తం చేస్తున్నాయి . 

Image result for jagan and chandra babu

అయితే ఎన్నికల ముందు సర్వే లు హల్ చల్ చేయడం సహజం. అయితే ఇప్పటికే చాలా జాతీయ సర్వేలు ప్రతి పక్ష పార్టీ అయినా వైస్సార్సీపీ దే విజయమని ఆ పార్టీకే ఎడ్జ్ ఉందని తేల్చేశాయి . అయితే ఈ సర్వేల మీద అంత నమ్మకం పెట్టుకోలేము ఎందుకంటే 2014 లో కూడా జగన్ దే అధికారం అని చెప్పారు తీరా చూస్తే టీడీపీ విజయాన్ని కైవసం చేసుకున్నది . అయితే ఇప్పడూ ఒక ప్రైవేట్ ఛానల్ ఆంధ్రాలో సర్వే నిర్వాహించంది అయితే ఆ ఛానల్ రిపోర్ట్ ప్రకారం హంగ్ రావొచ్చు అని అంచనా వేస్తుంది . అయితే హంగ్ రావటం అనేది చెప్పడం ఇదే ఫస్ట్ సర్వే అని చెప్పాలి. దీనితో ఈ సర్వే మీద అంత క్రెడిబిలిటీ లేదని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: