అఖిల భారత కాంగ్రెస్ కమిటీ - ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి బిజెపి ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీ భలే చురకలు అంటించారు అంటూ తమాషా విమర్శచేశారు కలలు కనడంలో రాహుల్ గాందీ శిక్షణ పొందుతున్నారు  అని ఆమె చమత్కరించారు. భారత దేశంలో అత్యున్నత పదవి అదే ప్రధాని పదవి కోసం కలలు కనడానికి కూడా శిక్షణ పొందిన వ్యక్తిని ప్రజలు ఎన్నుకోరాదని ఆమె అన్నారు.
Related image
సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న వీడియో ఒక దానిని ప్రస్తావిస్తూ రాహుల్‌ గాంధికి ఆయన పక్కనున్నవాళ్ళు సభా సమావేశా ల్లో ఎలా మాట్లాడాలో నేర్పుతారని కలలు కనడానికి కూడా రాహుల్ శిక్షణ పొందుతారు. తాజా వీడియోను బట్టి ఆయన తన సొంత మాటలనే తాను నమ్మరని, ఏం మాట్లాడాలో తనకు చెప్పే ఇతరుల పైనే ఆధార పడతారని అర్థమవు తోంది. ప్రజల్లో ఎన్నికలు నిర్వహించటం ద్వారా అత్యున్నత పదవికీ ఎంపికచేసే అర్హత ఆయనకు లేదని తెలుసు కోవడానికి దేశ ప్రజలకు ఇది హెచ్చరిక  అని స్మృతి వ్యాఖ్యానించారు.
Related image
మరో సందర్భంలో టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని 'బఫూన్' అనడంలో తప్పేమీ లేదని కేసీఆర్ ప్రియ తనయ ఎంపీ కవిత గుర్తు చేశారు.
Image result for kalvakuntla kavitha on rahul gandhi about bafoon
ప్రతిపక్షనేత పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించి దేశ ప్రధానిని ఎలా హత్తుకున్నరో దేశ ప్రజలంతా చూశారు. సిల్లీగా ప్రవర్తించే వారిని బఫూన్ అనే అంటా రని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీల పార్లమెంట్ సభ్యుల మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా చలోక్తిగా చురక అంటించారు. 
Image result for kalvakuntla kavitha on rahul gandhi about bafoon
ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. మా ఎజెండా ప్రజల కోసం పనిచేయడమే. రాజకీయ పార్టీల కోసం కాదు. దేశంలో అనేక రాజకీయ కూటము లున్నాయి. కొన్ని గతంలో విజయం సాధించాయ‌ని, రానున్న కాలంలో విజయం తమదేనని వ్యాఖ్యానించారు. పాపం! నారీ నారీ నడుమ మురారై  సమాధానం చెప్పే ఙ్జానం కోసం శిక్షణ తీసుకుంటారేమో రాహుల్ గాంధి. 
 Image result for rahul hugged modi

మరింత సమాచారం తెలుసుకోండి: