ఎన్నికల ప్రకటనకు ముందు గానే శాసనసభకు అభ్యర్థులను ప్రకటించాలనే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో తీవ్ర ఆందోళన రాజేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టిక్కెట్లను కేటాయిస్తారా? ఏంపిక చేసి కొందరికే టిక్కెట్లు కేటాయిస్తారా? అనే విషయమై ఇంకా ఏమాత్రమూ స్పష్టత రాలేదు. "గెలుపు గుర్రాలు" లకే బాబు టిక్కెట్లను కేటాయించనున్నారని అంటున్నారు. 
Image result for MLA Ticket Allotment by chandrababu strategies in AP
అయితే మారిన రాజకీయ అంచనాల ప్రకారం "గెలుపు ప్రధానం" గా గతానికి భిన్నంగా టిక్కెట్స్ అభ్యర్థులను కేటాయించనున్నట్టు చంద్రబాబు బుధవారంనాడు తన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అయితే "పనితీరు ఆధారం" గానే టిక్కెట్లను కేటాయిస్తామని చంద్రబాబు గతంలో పలుమార్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల తీరు, వారిపై ప్రజాభిప్రాయం, ఆర్ధిక సామర్ధ్యం మొదలైన విషయాలపై చంద్రబాబు నాయుడు ఎప్పటి కప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారని అందరికే తెలిసిందే. ఈ సర్వే ఆధారంగానే టిక్కెట్లను కేటాయింపు ఉండే అవకాశం లేకపోలేదు. కనీసం టిక్కెట్ల కేటాయింపులో సర్వేల ద్వారా లభించిన సమాచారం కీలకం కానుంది. 


అత్యంత తీవ్రమైన పోటీ ఎదురవనున్న దృష్ట్యా ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించి సరైన ప్రణాళిక ఎన్నికల ప్రచారం చేయాలనేది చంద్రబాబు వ్యూహం. అయితే టిక్కెట్టు దక్కని అభ్యర్థులు అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం కూడా ఉంది. అది చెసే హాని చాలా ప్రమాదం. అయితే గత ఎన్నికల తరుణంలో అభ్యర్థులను చివరి నిమిషం వరకు ప్రకటించక పోవడం వలన "గెలవాల్సిన చోట కూడ ఓటమి పాలు" కావలసి వచ్చిందనేది టీడీపీ భావన. దీంతో  ఈసారి ఎన్నికలకు కనీసం రెండు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబు ఆలోచన అని అభిప్రాయం వ్యక్తమౌతుంది. ఇప్పుడు అసలు సమస్య టిక్కెట్టు దక్కని వారిని చంద్రబాబు ఎలా సంతృప్తి పరుస్తారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. 


2014 ఎన్నికల్లో టీడీపీకి విజయం 103 సీట్లతో దక్కింది. అయితే ఆపరేషణ్ ఆకర్ష్ ద్వారా వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు 20కు మించి ఉన్నారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల కూడ టీడీపీ బలంగానే, పోటాపోటీ గానే ఉంది. అయితే ఈ నియోజకవర్గాల్లో చంద్రబాబునాయుడు ఎవరికీ టిక్కెట్లు కేటాయిస్తారు? అంటే అటు వైసిపి నుండి వచ్చి చేరిన అభ్యర్దులకా? లేక టిడిపి స్వంత అభ్యర్దులకా? అన్న విషయంలో స్పష్టత కోసం చర్చ కూడ టీడీపీలో జరుగుతుంది.  


నామినేషన్ల చివరిరోజు వరకు అభ్యర్థులను ప్రకటించని చరిత్ర టీడీపీది. అయితే అందుకు భిన్నంగా ఈ సారి అభ్యర్థులను చాలా ముందే ప్రకటిస్తానని చంద్రబాబు ప్రకటించడం పార్టీ నేతల్లో ఆసక్తిని, ఆందోళనను పెంచుతోంది. "పులిని చూసి నక్క వాత పెట్టుకున్న తీరున" తెలంగాణాలో లాగా టిక్కెట్ల ప్రకటన ముందుగా చేస్తే ఇక్కడ రాజకీయ పరిస్థితులకు అది సరిపడదని అంటున్నారు. అయితే  తెలంగాణలో టీఆర్ఎస్ సిట్టింగ్‌ అభ్యర్దుల్లో కొందరికి మినహా అందరికీ  టిక్కెట్లను కేటాయించింది.  ఏపీలో కూడ బాబు అదే పద్దతిని అనుసరిస్తారా? లేదా? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఊహా జనితాంశమే. 
chandrababu plans to give tickets best candidates in upcoming elections
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తే వారంతా గెలిచే అవకాశాలు ఉన్నాయా? అనేది కూడ చూడాల్సిన అంశం. గెలిచే అభ్యర్థులకే  అంటే టిడిపి పరి బాషలో గెలుపు గుర్రాలకే టిక్కెట్టు ఇవ్వాలనే చంద్రబాబు నిర్ణయం కొందరు సిట్టింగ్‌ లకు టిక్కెట్టు దక్కకుండా చేసే అవకాశం లేకపోలేదు. దరిమిలా వారి నుండి ఉత్పన్నమయ్యే తిరుగుబాటు ప్రమాదాలను నివారించటానికి, వారికి నామినేటేడ్ పదవులు ఇస్తామని దిట్టమైన హామీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. అయితే టిక్కెట్టు దక్కని అభ్యర్ధులు పోటీలో ఉన్న తమపార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తారనేది ప్రస్తుత రాజకీయాల్లో ప్రశ్నార్ధకం. సరిగా చెప్పాలంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల నియోజక వర్గం మొత్తం ప్రచారం చేసేందుకు వీలుంటుంది.


దీనిద్వారా తమ ప్రత్యర్థుల బలాబలాలు తెలుసుకొని తమ బలహీనతలను బలాలుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే అదే తరుణంలో  టిక్కెట్టు దక్కని వాళ్లు రెబల్స్ గా మారి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలను తీసివేయలేము. ఖచ్చితంగా కుటిల రాజకీయాలు రాజ్యమేలుతున్న వేళ టిక్కెట్ దొరకని అభ్యర్ధులు పార్టీ కోసం పార్టీ నిలబెట్టిన అభ్యర్ధికి సహకారం ఇస్తారనేది నమ్మకూడని విషయం కాని కనీసం కీడు చేయక పోతే అదే మహద్భాగ్యం.  

మరింత సమాచారం తెలుసుకోండి: