ఏపీలో బలమైన టీడీపీని ఢీ కొట్టాలంటే ఎంతటి ప్రజాబలం ఉన్నా సరిపోదన్నది అందరి మాటగా ఉంది. అంతెందుకు 2004 ఎన్నికలకు ముందు వైఎస్సార్ చరిస్మా పతాక స్థాయిలో ఉన్నప్పటికీ కలసి వచ్చిన కామ్రెడ్స్ తో పొత్తు పెట్టుకోవడమే కాదు, ఇంకో వైపు టీయారెస్ ని కూడా చేర్చుకుని  కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళింది. దాంతోనే చంద్రబాబు సర్కార్ అప్పట్లో కూలిపోయింది. మరి ఏపీలో రేపటి సీన్ ఏంటో...


మంతనాలు షురూ :


ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించాలంటే ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలికను నివారించాలన్నది తలపండిన నాయకుల ఆలొచనగా ఉంది. ఈ విషయంలో అటు జగన్, ఇటు పవన్ ఏమనుకుంటున్నారో తెలియదు కానీ రెండు పార్టీలు కలిస్తే మాత్రం టీడీపీ పని అవుట్ అన్న భావన అందరిలోనూ ఉంది. విడిగా పోటీ చేస్తే మాత్రం టీడీపీకి ప్లస్ అవుతుందని ఆందోళన కూడా  వ్యక్తం అవుతోంది. ఈ నేపధ్యంలో రెండు పార్టీల మధ్య రహస్యంగా చర్చలు తాజాగా మొదలయ్యానన్న మాట గట్టిగా వినిపిస్తోంది.


అక్కడ కలిసారట :


హైదరాబాద్ లోని ఓ రిటైర్డ్ అధికారి ఇంట్లో తాజాగా రెండు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగాయని ప్రచారం సాగుతోంది. సినిమా నటుడు, పవన్ సోదరుడు నాగబాబు, మై హోంస్ గ్రూప్ అధినేత‌ జూపల్లి రామేశ్వర్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ భేటీలో పాలుపంచుకున్నారని అంటున్నారు ఈ సందర్భంగా జనసేనకు 15 నుంచి 25 అసెంబ్లీ సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు కేటాయించే విషయమై అభిప్రాయ సేకరణ కూడా జరిగిందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే వైసీపీ, జనసేన పొత్తులకు సంబంధించి తెర వెనక గట్టిగానే కసరత్తు జరుగుతోందని అంటున్నారు


అధినేతలు దిగివస్తే :


పొత్తులకు సంబంధించి జగన్, పవన్ కళ్యాణ్   వాస్తవ పరిస్థితులకు తగినట్లుగా దిగివస్తే మాత్రం ఈ బంధం ఒక్కటి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు ఈ రెండు పార్టీల మధ్యన పొత్తు కుదిరితే మాత్రం టీడీపీకి భారీ షాక్ తగలక తప్పదంటున్నారు. సీమ జిల్లాలో ఇప్పటికీ బలమైన శక్తిగా వైసీపీ ఉంది, కోస్తా జిల్లాలో జనసేనకు ఆదరణ కనిపిసోంది. దాంతో టీడీపీకు అన్ని వైపుల నుంచి గెలుపు ద్వారాలు మూసివేసినట్లు అవుతుందని అంటున్నారు. మరి చూడాలి



మరింత సమాచారం తెలుసుకోండి: