తెలంగాణ ఎన్నికల్లో ముందస్తు వ్యహం తో తెరాస ఘన విజయాన్ని స్వంతం చేసుకున్నది అయితే డిసెంబర్ 19వ తేదీ బుధవారం పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 15 వేల మంది ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రుల నుండి మొదలుకొని సాధారణ కార్యకర్తల వరకు ఉన్నట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపై బాబు పలు సూచనలు చేశారు. సంక్రాంతికి ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. తాజాగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ ఏపీ ముఖ్యమంత్రి - పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Image result for chandra babu

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబుపై గులాబీ దళం తీవ్రంగా విరుచుకపడింది. ఏకంగా ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతామంటూ ఆ పార్టీ నేత (ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్) కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు స్పందిస్తూ చేసిన పనులతో గెలుపు ఏకపక్షం కావాలని - అసెంబ్లీలో అధిక్యత ఎంపీ సీటు గెలుపునే డిసైడ్ చేస్తుందని పేర్కొన్నారు.

Image result for chandra babu

ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తుక్కుతుక్కుగా ఓడిపోయిందని గుర్తు చేసిన బాబు ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో ఈ ఎన్నికలు నిరూపించాయని వివరించారు. డిసెంబర్ చివరి వారంలో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పడం జరిగిందని...దీనిని సాకుగా చూపి కేసీఆర్ రెచ్చగొట్టారని విమర్శించారు. టీఆర్ ఎస్ తొలుత హోదాకు అంగీకరించి ఇప్పుడు మాత్రం అడ్డుపడుతోందని..తెలంగాణలో టీఆర్ ఎస్ గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ కు ఇప్పుడు ఓవైసీ దోస్త్ అయ్యారన్న బాబు...మోడీ కనుసన్నలలో జగన్..ఒవైసీ పనిచేస్తున్నారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: