అభివృద్ధి చెందిన దేశమైనా, చెందుతున్న దేశమైనా అమెరికాతో పోల్చుకోవడం చాలా సహజం. ప్రజాస్వామ్య దేశంగా అమెరికా సాధించిన ప్రగతిని మిగిలిన దేశాలన్నీ ఫాలో అవుతుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మిగిలిన దేశాలకంటే కొన్ని దశాబ్దాల ముందుంది అమెరికా. అందుకే ఆ దేశంతో పోల్చుకుంటూ ముందుకెళ్తుంటాయి. అయితే భారత్ మాత్రం అమెరికాను మించి దూసుకెళ్లాలనుకుంది. అమెరికాలో ఇప్పటికీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లనే వాడుతారు.. కానీ భారత్ మాత్రం ఈవీఎంలను తీసుకొచ్చింది. ఇప్పుడదే చిక్కులు తెచ్చిపెడుతోంది.

Image result for evm and ballot paper

ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాలకంటే ఎక్కువమంది ఓటర్లున్న దేశం కూడా మనదే.! భారత్ లో ఎన్నికల ప్రక్రియ అంటే చాలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇంత పెద్ద దేశంలో ఎన్నికలను సులువుగా నిర్వహించాలంటే బ్యాలెట్ పేపర్ల బదులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. అప్పటి నుంచి కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఫలితం వచ్చేస్తోంది. రోజులతరబడీ బ్యాలెట్లను లెక్కపెట్టిన రోజులు పోవడంతో చాలా మంది సంతోషించారు. అయితే ఇప్పుడు ఆ ఈవీఎంలపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Image result for evm

ఈవీఎంలపై మొదటి నుంచి అనుమానాలున్నాయి. ఈవీఎంలో ఫలితం తమకు అనుకూలంగా వస్తే స్వాగతించడం, లేకుంటే తిట్టడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. తమకు అనుకూలంగా ఉంటేనేమో ఈవీఎంలు సరిగా పనిచేస్తున్నట్టు.. లేకుంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినట్టు ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈవీఎంలపై మాత్రం ఆరోపణలు కామన్ అయిపోయాయి. తాజాగా బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఈవీఎంలపై ధ్వజమెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లనే ఓటింగ్ కోసం వినియోగించాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాయి.

Image result for evm

దేశంలో 15 ఏళ్లుగా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా అధికార పార్టీలు అవకతవకలకు పాల్పడుతున్నాయని విపక్షాలు ప్రతిసారీ ఆరోపిస్తున్నాయి. అయితే ట్యాంపరింగ్ కు ఛాన్స్ లేదని, ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే తగిన బహుమతి ఇస్తామని ఎన్నికల కమిషన్ సవాళ్లు విసిరింది. ట్యాంపరింగ్ సాధ్యం కాకపోవచ్చేమో కానీ, ప్రోగ్రామింగ్ ద్వారా దాన్ని నియంత్రిచ్చవచ్చని కొంతమంది సాఫ్ట్ వేరే నిపుణులు చెప్పొకొచ్చారు. మొత్తంగా ఈవీఎంలపై అనేకమంది ప్రయోగాలు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఈవీఎంలు తప్ప మరో మార్గం లేదని తేల్చేసింది. తాజాగా ఓటరు తాను వేసిన పార్టీకే ఓటు పడిందో లేదో కనిపించేలా వీవీప్యాట్ లను తీసుకొచ్చింది.

Image result for evm

ఎప్పటికప్పుడు వస్తున్న సవాళ్లను ఎదుర్కొంటూ ఎన్నికల కమిషన్ ఈవీఎంలను అప్ గ్రేడ్ చేస్తోంది. అయినా ఆరోపణలు మాత్రం ఆగట్లేదు. ప్రతిసారీ సరికొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఈవీఎంలపై మరిన్ని కొత్త అనుమానాలు రేకెత్తించాయి. అవే పోలైన ఓట్లకంటే ఫలితాల్లో ఎక్కువ ఓట్లు రావడం.! ఇన్ని ఓట్లు పోలయ్యాయని పోలింగ్ రోజున ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే కౌంటింగ్ రోజు మాత్రం ఆ ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు తేలాయి. దీంతో పలువురు అభ్యర్థుల జాతకాలు తారుమారయ్యాయి. దీనికెవరు బాధ్యలు..?

 

.... ఈవీఎంలను ట్యాంపరింగ్ ఎలా చేయొచ్చు..? రెండో భాగంలో చూద్దాం...


మరింత సమాచారం తెలుసుకోండి: