ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.  తర్వాత కాంగ్రెస్ లో విభేదాలు రావడం..జగన్ సొంత పార్టీగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది.  రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశంఖారావం పూరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి బాటలోనే నడుస్తున్నారు. 

Related image

ఒకప్పుడు వైస్సార్ చేసిన పాదయాత్ర ఆదర్శంగా తీసుకొని ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి 46వ ఏట అడుగు పెడుతున్నారు. డిసెంబర్ 21, 1972 ఆయన పుట్టిన రోజు. ప్రజా నాయకులు  సాధారణంగా పుట్టిన రోజు అంటే ఎవరైనా..కుటుంబంతో, స్నేహితులతో, బంధువులతో, అభిమానులతో, కార్యకర్తలతో పుట్టిన రోజు జరుపుకోవడం మామూలే. కానీ ప్రజలతో కలిసి, ప్రజల మధ్య పుట్టినరోజు జరగడం ఆ రోజుకే ఒక ప్రత్యేకత ఇచ్చినట్టు కదా. వైయస్ జగన్ కు మాత్రమే ఆ అదృష్టం దక్కింది. 

Image result for ys jagan praja sankalpa yatra

మహానేత, వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు అనే ముద్ర నుంచి ప్రతిపక్ష నేత, జననేతనేత  వైయస్ జగన్ మోహన్ రెడ్డిగా ఎదిగిన అతడి ప్రస్థానం చాలా గొప్పది. మహానేత మరణం తర్వాత రాష్ట్రంలో ఆగిన గుండెలెన్నో.అప్పుడే తెలిసింది..వైఎస్ జగన్ కి..తన కోసం తన కుంటుంబ చిన్నదే అనుకున్నా..కానీ ఇంత పెద్ద కుటుంబం ఉందని ఆ కుటుంబం కోసం తన తుది శ్వాస వరకు పోరాడుతా అని ప్రతిజ్ఞ పూనారు. వారిని కలవడం, పరామర్శించడం ఆ తండ్రి కొడుకుగా తన బాధ్యత అనుకున్నాడు. 

Image result for ys jagan praja sankalpa yatra

ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీని, పదవిని వదలి బయటకు వచ్చారు వైయస్ జగన్. ఆయన ఆశయాలే లక్ష్యాలుగా, ఆయన లక్ష్యాలే మార్గదర్శకాలుగా భావించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.  నవ్యాంధ్రలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కురువృద్ధ పార్టీని మట్టి కరిపించారు. అమలు చేయలేని అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం చేసే అక్రమాలను అడుగడుగునా ఎండగడుతున్నారు.


ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్ష నాయకుడై పోరాడుతున్నారు.  నేడు జగన్ పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ఆర్ జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘యాత్ర’టీజర్ ని రిలీజ్ చేశారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: