భారతదేశంలో 2004 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎంల ద్వారానే జరుగుతున్నాయి. అయితే కొంతకాలంగా ఈవీఎంలు వద్దని, బ్యాలెట్‌ పేపరే కావాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్ గా భావించే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈవీఎంలు వద్దు బ్యాలెట్టే ముద్దు అంటున్నారు. అంతటితో ఆగని చంద్రబాబు.. ఈ అంశంపై కలిసొచ్చే అన్ని పార్టీలతో కలిసి కూటమి కట్టి పోరాడతామంటున్నారు.

 Image result for CHANDRABABU ON EVM

ఈవీఎంలను మొదట్లో స్వాగతించిన చంద్రబాబు.. ఆ తర్వాత నుంచి వాటిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మెషీన్లను ట్యాంపరింగే చేసే అవకాశం ఉందని తాను మొదటి నుంచి చెప్తున్నట్టు గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈవీఎంలు వద్దన్నానని చెప్తున్నారు. ఇది కేవలం తనకు మాత్రమే పరిమితం కాలేదని.. దేశంలో పలువురు నేతలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గతంలో తాము పోరాడితేనే వీవీ ప్యాట్‌లు వచ్చాయని వెల్లడించారు. ఈవీఎంలను ప్రోగ్రామింగ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చని చెప్తున్నారు.. అంతేకాక.. ఈవీఎంలలో నిక్షిప్తమైన డేటా చాలా కాలం ఉండదని.. బ్యాలెట్ పేపర్లు అయితే ఎవరూ చెరిపేయలేరని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు.

 Image result for evm tampering

మిగలిన వాళ్ల సంగతేమో కానీ.. చంద్రబాబు మరోసారి ఈవీఎంలపై చర్చ రాజేశారు. చంద్రబాబు బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలసి పనిచేస్తుండడంతో వాళ్లు కూడా చంద్రబాబు మాటలతో ఏకీభవిస్తున్నారు. పలువురు నేతలు చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా ఈవీఎంలపై పెద్ద చర్చే జరిగింది.. ఎన్నికలు ముగిసిన తర్వాత తమకు వ్యతిరేకంగా ఫలితం వచ్చినవాళ్లు కొంతమంది ఈవీఎంలపై కోర్టుల్లో కేసులు వేశారు. వాటిపై పలువురు ఎన్నిక సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు.. అయినా ఎన్నికల కమిషన్ మాత్రం ఆ ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. నేతలు లేదా పార్టీలు చేస్తున్న ఆరోపణలు అవాసమతవమని కొట్టి పారేస్తున్నారు. ఆరోపించేవారు ఎవరైనా వాటిని నిరూపించాలని సవాల్ చేస్తున్నారు. ఈవీఎంలపై వచ్చిన ఆరోపణలపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నామని, పార్టీల కోరికమేరకు మార్పులు చేస్తున్నామని ఎన్నికల సంఘం చెప్తోంది.

 Image result for evm tampering

ప్రతిసారీ ఎన్నికల ముందు ఈవీఎంలపై ఎందుకీ గోల..? ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నా కూడా పార్టీలు, నేతలు ఎందుకు వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..? అనే ప్రశ్నలు ఎప్పడూ కొత్తగా వస్తూనే ఉన్నాయి. అయితే ఈవీఎంల ద్వారా ఎప్పటికప్పుడు సరికొత్త సమస్యలు వస్తుండడంతోనే ఈ అనుమానాలు కలుగుతున్నాయనేది పార్టీలు చెప్తున్న మాట.! తాజాగా వచ్చిన మరో అనుమానం పోలైన ఓట్ల కంటే ఫలితాల్లో ఎక్కువ ఓట్లు రావడం..! దీనిపై ఇంతవరకూ ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.. మరి దీన్ని పరిష్కరించేదెవరు..?

 

... ఈవీఎం కహానీ – 3 లో పార్టీల ద్వంద్వ వైఖరిని చూద్దాం!


మరింత సమాచారం తెలుసుకోండి: