ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయంగా పరిస్థితి అంత బావున్నట్టు లేదు. ప్రత్యేకించి తెలంగాణ ఎన్నికలు ఆయన్ను బాగా నిరాశపరిచాయి. తెలంగాణలో ప్రజాకూటమిని గెలిపిస్తే.. కేంద్రంలో పరపతి పెరుగుతుందనుకుంటే.. ఇప్పుడు అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వస్తోంది.

Image result for trs mlc akula lalitha meets kcr

తెలంగాణ ఎన్నికలను ఆయన వదిలేసినా.. తెలంగాణ నాయకులు మాత్రం వదిలేలా లేరు. తెలంగాణలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. గెలిచిన కొద్ది మంది నాయకులు కూడా ఈ మాత్రం దానికి ఎందుకు వెళ్లి టీఆర్‌ఎస్‌ లో చేరిపోతే బావుంటుందన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అంతే కాదు.. వెళ్తూ వెళ్తూ కారణం చంద్రబాబుపై వేసి వెళ్తున్నారు.

Image result for trs mlc akula lalitha meets kcr


ఇక టీఆర్ఎస్‌లో చేరిపోవడం ఒక్కటే మిగిలిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబును బూచిగా చూపిస్తున్నారు. తెలంగాణలో ప్రజాకూటమి ఓటమికి ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనే కారణమని తేల్చి చెబుతున్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్లనే గెలవాల్సిన కాంగ్రెస్ ఓడిపోయిందంటున్నారు.



పాపం.. ఎప్పుడూ చంద్రబాబుపై ఒంటి కాలిపై లేచే టీఆర్ఎస్ నేతలు మాత్రం విచిత్రంగా చంద్రబాబుకు దన్నుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు తమ పరాజయాన్ని చంద్రబాబుపై తోసేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పై ఉన్న నమ్మకంతో జనం పాజిటివ్ ఓటు వేశారని.. ఇటీవలే టీఆర్ఎస్ ఎంపీ కవిత కామెంట్ చేయడం విశేషం. ఇక ఇప్పుడు పార్టీ వీడి వెళ్లే నేతలంతా చంద్రబాబునే సాకుగా చూపుతారేమో పాపం..


మరింత సమాచారం తెలుసుకోండి: