తెలంగాణలో ప్రజాకూటమిని గెలిపించి ఢిల్లీలో పరపతి పెంచుకుందామనుకున్న టీడీపీ బాస్ చంద్రబాబుకు తీవ్ర నిరాశ తప్పలేదు. పాపం ఆయన తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి పది రోజులు భారమంతా తన భుజస్కంధాలపై వేసుకుని ప్రచారం చేసినా ఆ పార్టీ 12 స్థానాల్లో పోటీ చేసి కేవలం 2 స్థానాల్లోనే గెలవగలిగింది.

Image result for sandra venkata veeraiah

ఐతే.. ఇప్పుడు గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం టీఆర్ఎస్ పార్టీలో చేరబోతుండటం ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే అమరావతి వెళ్లి మరీ చంద్రబాబును కలిసిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బాస్ కు అనుకోని షాక్ ఇచ్చారు. సత్తుపల్లి నుంచి వరుసగా మూడోసారి టీడీపీ తరపున గెలిచిన సండ్ర వెంకటవీరయ్య చివరకు టీఆర్‌ఎస్‌ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలతోనూ మాట్లాడారు.

Image result for TELANGANA TDP


సండ్రవెంకట వీరయ్య తనతో పాటు గెలిచిన అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కూడా తన వెంట తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు వారిద్దరూ శుక్రవారం ఖమ్మంలో ఓ ఇంట్లో చర్చలు జరిపారు. టీడీపీ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన సండ్ర వెంకట వీరయ్య ఇన్నాళ్లూ పార్టీ తరపున గట్టిగానే నిలబడ్డారు. 2014 ఎన్నికల్లో గెలిచిన చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ లో చేరినా ఆయన మాత్రం పార్టీకే కట్టుబడి ఉన్నారు.

Image result for TELANGANA TDP


ఇక తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదని తేలిపోవడంతో ఆయన ఇక పోరాటం చేసినా ఫలితం ఉండదన్న భావనకు వచ్చినట్టున్నారు. పాపం ఆయన ఒక్కరు మాత్రం ఎంత కాలం పోరాడతారు. అందులోనూ ఆయన మెడపైనా ఓటు కు నోటు కేసులో కత్తి వేలాడుతోంది మరి. మొత్తానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు నిజమే అయిన పక్షంలో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం లేనట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: