ఎన్టీఆర్ బయోపిక్ ఆడియోలో ట్రైలర్ ఫంక్షన్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన హాట్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. అన్న గారితో సాన్నిహిత్యం తనకు ఎంతో ఉందని చెప్పుకున్న మోహన్ బాబు ఆయన జీవితంలో జరిగిన ఘటనల విషయం గురించి పరొక్షంగా కొంత ప్రస్తావించి సభలో కలకలం రేపారు.


ఎలా చూపించారో :


:
ఎన్టీఆర్ జీవితంలో కొందరు మంచి వాళ్ళు ఉన్నారు. కొందరు చెడ్డ వాళ్ళు ఉన్నారు. మరి దర్శకుడు క్రిష్ వారిని ఎలా తీర్చిదిద్దారో అంటూ మోహన్ బాబు సెటైర్లు వేయడం విశేషం. చెడ్డవాళ్ళను మంచిగా చూపిస్తారేమో అంటూ మోహన్ బాబు అనడం గమనార్హం. మరి చెడ్డ వారు ఎవరు, వారిని మంచిగా చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నది ఇక్కడ చర్చకు తావు ఇస్తోంది. అన్న గారి జీవితంలో చెడ్డ వారు అంటే రాజకీయాల్లోనే కనిపిస్తారు. రెండు సార్లు ఆయన వద్ద నుంచి అధికారం గుంజుకున్నారు. బహుశా ఈ విషయానే మోహన్ బాబు మనసులో ఉంచుకుని ప్రస్తావించారని అంటున్నారు.


గొప్ప అనుబంధం :


తనకు ఎన్టీఆర్ తో ఎవరికీ లేని సాన్నిహిత్యం ఉందని, అన్ని విషయాలను ఆయన తనతో షేర్ చేసుకునేవారని మోహన్ బాబు చెప్పడం కూడా ఆసక్తిని రేపుతోంది. మరి చివరి రోజుల్లో  ఎన్టీఆర్ తో మేజర్ చంద్రకాంత్ మూవీ తీసిన మోహన్ బాబు బాగా క్లోజ్ గానే మెలిగారు. అలాంటిది ఆయనతో ఎన్టీఆర్ ఏం చెప్పి ఉంటారన్నది కూడా ఇంటెరెస్టింగ్ పాయింటే. మొత్తానికి ఎన్టీఆర్ జీవిత చరిత్ర పేరిట క్రిష్ తీస్తున్న ఈ మూవీలో చెడ్డ వారు ఎవరన్నది హాట్ టాపిక్ గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: