ఎప్పటికి ఏది అవసరమో ఆ బాట, మాట పట్టిన వాడే సిసలైన రాజకీయ నాయకుడు. ఆ విషయంలో టీడీపీ అధినేత నాలుగాకులు ఎక్కువే చదివారు. బీజేపీ నుంచి బయటకు రాగానే కాంగ్రెస్ వైపు తిరిగిన చంద్రబాబు రాహుల్ ప్రధాని అవుతారని, ప్రత్యేక హోదా ఇస్తారని అటు పార్టీ శ్రేణులకు చెబుతున్న సంగతి విధితమే. కేంద్రంలో రెండే రెండు కూటములు ఉన్నాయని, అవి కాంగ్రెస్, బీజేపీ కూటములని బాబు  తరచూ అంటున్నారు కూడా. కాంగ్రెస్ సహకారం లేకుండా ఏ కూటమీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేఅదని కూడా బాబు చెబుతూ వస్తున్నారు. 


ప్రధాని తరువాతట:


ఇపుడు ఉన్నట్లుండి బాబు తన స్టాండ్ మార్చుకున్నారు. విశాఖలో ఈ రోజు జరిగిన ఇందియా టు డే కంక్లేవ్ లో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, జాతీయ కూటమి ప్రధాని అభ్యర్ధి ఎవరో ఎన్నికల తరువాతనే నిర్ణయిస్తామని చెప్పారు. ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదని, బీజేపీని ఓడించడమే తమ అజెండా అని కూడా బాబు అన్నారు. రాహుల్ గాంధి ప్రధాని అంటూ డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పిన విషయంపై స్పందిస్తూ ఆ  వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు


హోదా మాటేంటి :


మరి కాంగ్రెస్ కేంద్రంలో వస్తుంది, రాహుల్ ప్రధాని అవుతారని, ప్రత్యేక హోదాపై సంతకం పెడతారని ఓ వైపు హస్తం పార్టీ నాయకులు ఏపీలో చెప్పుకుని తిరుగుతున్నారు. మరో వైపు హోదా ఇస్తామని చెప్పారు కనుకనే కాంగ్రెస్ తో కలిసాం అని బాబు అంటూ వచ్చారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి  రాక, రాహుల్ ప్రధాని కాకపోతే ఏపీకి హోదా ఎలా వచ్చినట్లు, ఈ సంగతికి చంద్రబాబే చెప్పాలని అంటున్నారు. ప్రాంతీయ పార్టీలైన మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ వంటి వారు రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించమని చెప్పడంతో బాబు ఇపుడు అడ్డం తిరిగారని అంటున్నారు.

 మరి రేపు ఇదే ప్రాంతీయ పార్టీల్లో ఎవరో ఒకరు పీఎం గా ఉంటే ఏపీకి హోదా ఎలా వస్తుందని కూడా అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో అయోమయంగా ఉన్న ప్రాంతీయ పార్టీల  వైఖరితో హోదా కూడా పక్కకు పోతోందని కూడా అంటున్నారు. బాబు సైతం ఎప్పటికపుడు స్టాండ్ మారుస్తూ వెళ్ళడం వల్ల రాజకీయంగా కరెక్ట్ గానే ఉన్నా ఏపీ ప్రయోజనాలూ, హోదా వంటివి ఎలా సాధిస్తారన్నది మాత్రం చెప్పలేకపోతున్నారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: