కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఏపీ సీఎం చంద్రబాబు జలక్ ఇచ్చారు. కాంగ్రెస్ కూటమిని ఎన్నికల్లో గెలిపించి మోడీకి బుద్ది చెప్పాలని ఇటీవల చంద్రబాబు కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. అందుకే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీని నడిపించింది చంద్రబాబే అన్నంతగా ఇన్వాల్వ్ అయ్యారు.

Image result for chandrababu rahul gandhi


అయితే ఉన్నట్టుండి చంద్రబాబు రాహుల్ గాంధీకి జలక్ ఇచ్చారు. ఇటీవల చెన్నైలో కరుణానిధి విగ్రహావిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ కూటమిలో పెద్ద పార్టీల నాయకులంతా వచ్చారు. ఆ సమయంలో డీఎంకే చీఫ్ స్టాలిన్ రాహుల్ కాబోయే ప్రధాని అని ప్రశంసించారు. దాంతో కూటమిలో ప్రధాని ఇష్యూ చర్చకు వచ్చింది.

Stalin defends Rahul for PM pitch: Need strong leadership


ఇప్పుడు తాజాగా.. ప్రతిపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని చంద్రబాబు నాయుడు విశాఖలో స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తూ డీఎంకే చీఫ్ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్నారు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు.

Image result for chandrababu rahul gandhi


ఎన్నికల తర్వాత నా నిర్ణయం వెల్లడిస్తాను. ఇప్పటికిప్పుడే తెలుగుదేశం దీనిపై మాట్లాడకూడదు. ఈ అంశంపై కూటమి పార్టీలన్నీ కలసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్‌ వచ్చే పరిస్థితి ఉంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావడం కష్టం. కాంగ్రెస్ కు ఫుల్ మెజారిటీ వస్తుందన్న గ్యారంటీ లేదు. అందుకే చంద్రబాబు ముందు జాగ్రత్తపడుతున్నట్టు కనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: