జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ దర్శకత్వం వహిస్తూ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్న "ఎన్టీఆర్ కథానాయకుడు - ఎన్టీఆర్ మహానాయకుడు" రెండు బాగాలు సాధారణ పరిస్థితుల్లో వినోదాన్ని అందించగలవని చెప్పటంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ సినీ వైభవం వరకు ఎన్ని నిజాలు దాచిపెట్టి చూపినా మహానటి చిత్రంలాగా ఘనవిజయం తధ్యం. కారణం అది ఒక మహా నటుని సజీవ చిత్రం అవుతుంది.

Image result for ntr kathanayakudu & MahanayakuDu Vs Lakshmi's NTR 

ఆయన సినీజీవితంతో అందులోని అద్భుతవిజయాలతో సఖల ఆంధ్ర జనులకు ఆ దివి నుండి ఊడిపడ్డ దైవస్వరూపుడై అందరికి అంటే ఆయన రాజకీయ శత్రువులకు కూడా నటుడుగా ఆరాధ్యదైవం అయ్యారు. నటుడుగా ఆయన్ని హృదయాల్లో పెట్టుకోని తెలుగువాళ్ళు ఉండటం బహు అరుదు. అందులో అనుమానించ వలసింది లేశ మాత్రం కూడా ఉండదు. Image result for ntr kathanayakudu & MahanayakuDu Vs Lakshmi's NTR

పై ప్రధాన విషయంతో పాటు ఆయన రాజకీయ ఆగమనం అప్పటి నుండి ఆయన సంక్షేమ పాలన, మధ్యపాన నిషేధం, స్త్రీలకు తండ్రి నుండి బాగస్వామ్య హక్కులు - మొదలైనవి అనేక సమాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో తెచ్చిన విప్లవ సంఘటనలు అనేకం - తెలుగు ప్రజలు క్షణం కూడా మరచి పోరు. తెలుగువారి ఆత్మగౌరవం ఆత్మాభిమానం మొదలైన నినాదాలతో అసలు తెలుగు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ కు నింగిని చుంభించిన స్థాయిలో విశ్వవ్యాప్త గౌరవ అధరా భిమానాలు సాధించిపెట్టారు. అందుకే ఆయన విశ్వ విఖ్యాత మైనాడు. పార్టీ పుట్టీన తొమ్మిది నెలల్లో అధికారంలోకి తెచ్చిన చరిత్ర ఆయనది. ఇంతవరకు చూపితే వివాదా లు ఉండవు ఈ రెండుబాగాల సినిమాలో.

Image result for ntr kathanayakudu & MahanayakuDu Vs Lakshmi's NTR

ఆ తరవాత రాష్ట్రంలో రాజకీయాలు తీసుకున్న మలుపులు ముఖ్యంగా లక్ష్మి పార్వతి నందమూరి జీవితంలోకి ప్రవేసించటానికి దారి తీసిన పరిస్థితులు, ఆమెను ఎలిమినేట్ చెయ్యటానికి తెలుగు దేశంలో విస్పొటనంలా దూసుకువచ్చి కుట్ర కుతంత్ర మాయాజా లంతో వెన్నుపోటు రాజకీయాలు నడిపి నందమూరి హస్తాల నుండి పదవి ప్రభుత్వం జారిపోవటానికి కారణమైన వ్యక్తుల గురించి ఆయన జీవిత నిర్గమం వరకు సాగిన సమగ్రంగానైనా ఆయన రాజకీయ జీవన చరిత్రను  యధార్ధ విషయాలతో చూపకపోతే అది బయోపిక్ కాదనేది ఉభయ రాష్ట్రాల తెలుగు వారి భావన. విశ్లేషకులు అదే చెపుతున్నారు.

Image result for ntr kathanayakudu & MahanayakuDu Vs Lakshmi's NTR

అందుకే ఆ నిజాలకోసం లక్ష్మిస్ ఎంటీఆర్ చూసేవాళ్ళ సంఖ్య ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు ప్రేక్షకుల కంటే ఎక్కువే ఉంటారన్నది ముందే లిఖించబడింది సువర్ణ అక్షరాలతో, ఎందుకంటే ఎన్టీఆర్ జీవన చిత్రాన్ని నిర్మించేది ఆయన నుండి  దౌర్జన్యంగా  అధికారాన్ని గుంజేసుకున్న నేటి టిడిపిలో కీలక నాయకుడు నిర్మిస్తున్నారు కాబట్టి. నేపధ్యంలో తానే కథానాయకుడు మహానాయకుడని ప్రచారం చేసుకొంటున్నారు అసలు ప్రతినాయకుడు కాబట్టి   అక్కడే రాం గోపాల్ వర్మ వ్యూహ చతురత అర్ధమౌతుంది.


వెన్నుపోటు గేయం లిరిక్

  

దగా! దగా!.. మోసం!..

 

నమ్మించి నమ్మించి

 

వెన్నుపోటు పొడిచారు

 

వంచించి వంచించి

 

వెన్నుపోటు పొడిచారు

 

కుట్ర కుట్ర కుట్రా!..ఆహా!

 

పొంచి పొంచి పడగలే యెత్తి వీళ్ళు


కూత నీతి విషమునే చిమ్మినారు


దొంగ ప్రెమ నటనలే చూపి వీళ్ళు


కలియుగాన శకునులై చేరినారు


దహించనీ దురాగతం క్షమించ సాధ్యమా!

 

కుట్ర కుట్ర కుట్రా!

 

అయినవాళ్ళు ఒక్క రాత్రి వదిలివేసినారు

 

అసలు రంగు బయట పెట్టి కాటు వేసినారు

 

ఒంటరినే చేసి గుంపు దాడి చేసి

 

సొంత గూటి నుంచి కూడ వెలి వేసినారు

 

కుట్ర కుట్ర కుట్రా!

 

న్యాయమనే కోటని కాల్చి తగలబెట్టినారు

 

నీతికేమొ గొయ్యి తీసి పాతి పెట్టినారు

 

గోతి కాడ నక్కలల్లే మాటు వెసి

 

ఆత్మ గౌరవాన్ని చంపి ఆహుతి చేసినారు

 

కుట్ర కుట్ర కుట్రా!  

 

పొంచి పొంచి పడగలె యెత్తి వీళ్ళు

 

కుటిల నీతి విషమునే చిమ్మినారు

 

దొంగ ప్రేమ నటనలే చూపి వీళ్ళు

 

కలియుగాన శకునులై చేరినారు

 

దహించనీ దురాగతం క్షమించ సాధ్యమా!

 

కుట్ర కుట్ర కుట్రా!  

 

Image result for ntr kathanayakudu & MahanayakuDu Vs Lakshmi's NTR

మరింత సమాచారం తెలుసుకోండి: