ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందుకో ప్రాముఖ్యత కలిగిన సీట్లు కొన్ని ఉన్నాయి. అవి మొత్తం రాష్ట్రానికే పరిచయం అయిన సీట్లు. అక్కడ గెలుపు ఓటములపై అంతా చర్చించుకుంటారు. అలా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఆ ఇద్దరి మంత్రుల సీట్లు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం అక్కడ వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సాగుతోంది.


పోటెత్తిన జనం  :


జగన్ శ్రికాకుళం జిల్లా పాదయాత్రకు జగన్ పోటెత్తుతున్నారు. వరసగా అన్ని అసెంబ్లీ సీట్లలో జగన్ చేస్తున్న పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మంత్రి కళా వెంకటరావు సొంత సీటు ఎచ్చెర్లలో జనం జగన్ సభకు ఓ లెక్కలో వస్తే తాజాగా టెక్కలిలో జరిగిన బహిరంగ సభకు వెల్లువలా తరలివచ్చారు. ఓ వైపు అదే రోజు ముఖ్యమంత్రి టూర్ ఉన్న సరే జనం జగన్ కి జేజేలు కొట్టడం ఇపుడు చర్చనీయాంశంగా ఉంది.


అచ్చెన్నకు షాకేనా :


2014 ఎన్నికల్లో కేవలం ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన మంత్రి అచ్చెం నాయుడుకు ఈసారి గడ్డు కాలమనే చెబుతున్నారు. నియోజకవర్గంలో ఆయన పట్ల వ్యతిరేకత తీవ్రంగా ఉందంటున్నారు. ఇక పనితీరు విషయంలో స్వయంగా బాబే పలుమార్లు హెచ్చరించిన సంగతి విధితమే. మంత్రి దూకుడు వ్యవహారం తో క్యాడర్ కూడా కినుక గా ఉన్నారు. ఈ టైంలో జగన్ పాదయాత్రకు  జనం పెద్ద సంఖ్యలో రావడం మంత్రికి డేంజర్ బెల్స్ మోగినట్లేనని అంటున్నారు. దానికి తోడు టెక్కలిలో వైసీపీకి గట్టి పట్టు ఉండడం, ఇక్కడ ఒకసారి గెలిస్తే మరో మారు ఓడిపోతారన్న సెంటిమెంట్ ఉండడం వంటివి చూసుకుంటే మాత్రం అచ్చెన్నకు అచ్చిరాని కాలమేనని అంటున్నారు.


సెటైర్లు వేసిన జగన్ :


అచ్చెన్న తాటి చెట్టు అంత ఎదిగారు, కానీ ఈత చెట్టు అంత ఉపకారం కూడా తన సొంత ప్రాంతానికి చేయలేదని జగన్ చేసిన విమర్శలు టెక్కలిలో కేక పుట్టించాయి. తిత్లీ తుపాను సాయం అందక జనం అల్లలాడడాన్ని సైతం జగన్ వదలకుండా చంద్రబాబు సర్కార్ పై కామెంట్స్ చేశారు. ఇక తాజాగా  వచ్చిన పెతాయ్ తుపాను విషయంలో కూడా బాబు ఏపీని పట్టకుండా కాంగ్రెస్ సీఎం ల ప్రమాణానికి వెళ్ళడాన్ని ప్రస్తావించారు. మొత్తానికి జగన్ టెక్కలి మీటింగ్ సూపర్ సక్సెస్ కావడంతో టీడీపీలో కలవరం మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: