చంద్ర బాబు మీద జగన్ దూకుడు పెంచాడు. వెటకారపు మాటలతో చంద్ర బాబు మీద రెచ్చి పోతున్నాడు. బాబుపై జగన్ సంధించిన వ్యంగ్యస్త్రాలు.. ఏపీ ముఖ్యమంత్రి చేసిన తప్పుల్ని  ఎత్తి చూపుతూ.. చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. చంద్రబాబు అహంకారం ఒక స్థాయి దాటిపోయి మాట్లాడుతున్నారు. ఈ పెద్దమనిషి ఇటీవలి కాలంలో అంటున్న మాటలు ఏమిటో తెలుసా? సముద్రాన్ని కంట్రోల్ చేశాడంట. పెథాయ్ తుపానును ఓడించాడట.

Image result for chandra babu

సముద్రాన్ని కంట్రోల్ చేయడమేమిటి? తుపానును ఓడించడమేమిటి? ఈ పెద్దమనిషి చేయడమేమిటి? మైకుల్లో చెప్పడమేమిటి? దానిని ఆ ఎల్లో మీడియా వాళ్లు రాయడమేమిటి? టీవీల్లో చూపించడమేమిటి?  చంద్రబాబును నేనివాళ ఒక్కటే అడుగుతున్నా. రాష్ట్రాన్ని విడగొట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? విభజన చట్టంలో విభజన హామీలన్నీ అమలు చేస్తామని పొందుపర్చకుండా ప్రతి హామీని.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ దగ్గరి నుంచి ఆయిల్ రిఫైనరీ -విశాఖపట్టణం రైల్వే జోన్ - ప్రత్యేక హోదా అన్నీ కూడా చూస్తాం.. పరిశీలిస్తాం.. అని చెప్పడం కాంగ్రెస్ చేసిన అన్యాయం కాదా? 


 తుపాను ఎలా వస్తుందో - ఎంత వేగంగా వస్తుందో ఐఎండీ - ఇస్రోలు రిపోర్టులు ఇస్తే వాటినే ఆర్టీజీఎస్ లో అటు ఇటుగా మార్చి ఇదేదో తానే కనిపెట్టానని చెప్పుకుంటున్న ఈ మనిషి అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? సెల్ ఫోన్ - స్మార్ట్ ఫోన్ తానే కనిపెట్టానంటాడు. కంప్యూటర్లు కూడా తానే తెచ్చాడట. హైదరాబాద్ ను కట్టానంటారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుకు తానే బ్యాడ్మింటన్  నేర్పానంటాడు. తెలుగువాడైన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లకు కంప్యూటర్ కొట్టడం కూడా నేర్పించానంటాడు. అని జగన్ వ్యంగ్యంగా మాట్లాడినాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: