2019 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసే స్థానం కుప్పం అని వినిపిస్తుంది. అయితే కుప్పం నుంచి తనయుడిని నిలబెట్టి తను మరోసీటును చూసుకోనున్నాడట చంద్రబాబు నాయుడు. మరి లోకేష్‌ను అసమర్థుడిగా చూపడం కాకపోతే దీన్ని ఏమనాలి? రాజకీయాల్లోకి చాలామంది నేతలు తమ తనయులను తీసుకొచ్చారు. అయితే వారు బతికి ఉండగానే.. తమ సీట్లో తమ వారసులను నిలబెట్టి.. తాము మరోసీటును చూసుకున్న వాళ్లు మాత్రం ఎక్కడా కనపడరు.

Image result for lokesh and chandrababu

రాజకీయ నేతలు మరణించినప్పుడు వారి వారసులు, దివంగతుల సీట్లలో పోటీచేస్తూ ఉంటారు. అదే సదరునేత బతికే ఉండగా, పదవిలో ఉండగా వారసుడు ఎంట్రీ ఇచ్చినప్పుడు అయితే.. మరొక సీటును ఎంచుకోవడం ఆనవాయితీ. ఇప్పుడు లీడ్‌లో ఉన్న వారసుల కథ కూడా అలానే ఉంది. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన జగన్‌ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రాలేదు, కడప నుంచి ఎంపీగా పోటీచేసి రాజకీయాల్లోకి వచ్చాడు.

Image result for lokesh and chandrababu

కేటీఆర్‌ కూడా తండ్రి సీటు నుంచి పోటీ చేయలేదు. కొత్త సీటును వెదుక్కొని పోటీచేశాడు. వీరు మాత్రమేకాదు.. దేశంలో చాలామంది రాజకీయ వారసులు తండ్రి లీడ్‌లో ఉన్నప్పుడు వస్తే.. కొత్త సీటును జాగా చేసుకున్నారు. ఇప్పుడు సీమలో పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో ఉన్న వారసులు కూడా తమ పెద్దవాళ్లు ఉన్న సీట్లలో కాకుండా.. కొత్త సీట్ల వైపు చూస్తున్నారు. పరిటాల సునీత తనయుడు హిందూపురం ఎంపీ సీటు అడుగుతున్నాడు. ఇలా వాళ్లలో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ విధంగా సేఫ్‌ జోన్‌ని, కంఫర్ట్‌ జోన్‌ని వెదుక్కొంటున్నాడు లోకేష్‌. ఈ ఐడియా చంద్రబాబుదే అని అంటున్నారు. ఎవరిది అయినా.. ఇలా చంద్రబాబు సీట్లోనే లోకేష్‌ పోటీచేయడం.. తనయుడి కోసం చంద్రబాబు మరో సీటు కోసం వెళ్లడం.. లోకేష్‌ను జనాల ముందు మరింత అసమర్థుడిగా ప్రొజెక్ట్‌ చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: