రాం గోపాల్ వర్మ తనపై తెలుగుదేశం పార్టీ నేతలు పెట్టే కేసులకు భయపడబోనని అన్నారు. తనపై కేసులు పెట్టేవారు ఒకసారి గతంలో చంద్రబాబు నాయుడు గురించి దివంగత తెలుగు జాతి నేత నందమూరి తారక రామారావు ఏమి చెప్పారో వినండని సంబందిత వీడియోని ఆ వివాదాస్పద ప్రఖ్యాత దర్శకుడు పోస్ట్ చేశారు. మరి అప్పుడు ఎన్టిఆర్ పై ఎన్ని? కేసులు పెట్టారని ఆర్జివి ప్రశ్నించారు.

వెన్నుపోటు పాటతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించిన రామ్‌ గోపాల్‌ వర్మ ఈ వివాదాన్ని మరింతగా పెంచి పెద్దది చేసేపనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ పాట విషయంలో టీడీపీ శ్రేణులు అన్నీ మండిపడుతుంటే అగ్నికి ఆజ్యం పోసేలాగా మరిన్ని ట్వీట్లు పెట్టేశాడు. తనకు వార్నింగ్‌ లు, హెచ్చరికలు, బెదిరింపులు చేసే వారి వీడియోలను తన 'సోషల్ మీడియా పేజ్‌' లో పోస్ట్ చేస్తూ ఇలాంటి వాటికి భయపడేదే లేదని అంటున్నాడు.
Ram Gopal Varma Comments On Vennupotu Song Contraversy - Sakshi
అంతేకాదు తనపై టీడీపీశ్రేణులు కేసులువేయటంపై కూడా ఆర్జివి ఆసక్తికరంగా స్పందించాడు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియోను తన ట్విట్టర్‌-పేజ్‌లో పోస్ట్‌ చేసిన వర్మ నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగా ఒక్కమాట కూడా అనలేదు. అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్ గా దూషించిన ఈ క్రింది వీడియోలోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి? అంటూ కామెంట్ చేశాడు. ముందు ముందు ఈ వివాదం ఇంకెన్నీ మలుపులు తిరుగుతుందో చూడాలి. దీనికి టిడిపి నేతలు సమాదానం చెబుతారా?

నేను CBN గారిని డైరెక్ట్ గా ఒక్కమాట కూడా అనలేదు ...అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్ గా దూషించిన ఈ క్రింది వీడియో లోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి ?


మరింత సమాచారం తెలుసుకోండి: