తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్  భారీ  ఘన స్వాగతాల మధ్య విశాఖ పర్యటన చేశారు. ఆయన నగరంలోని శ్రీ శారదాపీఠాన్ని సందర్శించి అక్కడ స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. నగరంలో దాదాపుగా నలుగ్లు గంటల సమయం గడిపిన కేసీయార్ స్థానికంగా ఎవరినీ కలవలేదు. ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా స్వామిజీ ఆశ్రమానికే చేరుకున్నారు.


తెలంగాణా పోలీసులు :


ఇక కేసీయార్ పర్యటనలో తెలంగాణా పోలీసుల హడావుడి కనిపించింది. కేసీయర్ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి నిన్న రాత్రి వచ్చిన తెలంగాణా పోలీసులు  మొత్తం ఆయన బందోబస్తును వారే తీసుకుని ఏపీ పోలీసులను డమ్మీలు చేశారు. కేసీయార్ వెళ్ళిన శారాడాపీథం ప్రాంగణం మొత్తం తెలంగాణా పోలీసులు తమ అదుపులోనికి తీసుకుని పర్యవేక్షించడం  చర్చకు దారి తీసింది. కెసీయార్ కి ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదా అన్నది అంతా మాట్లాడుకునెలా చేసింది. ఇక కేసీయార్ ఒడిషా, కోల్కటా కూడా వెళ్తున్నారు. మరి అక్కడ కూడా ఇలాగే సొంత పోలీసులను వినియోగించుకోరు కదా. కేవలం ఏపీలోనే తెలంగాణా పోలీసులు వచ్చారంటే చంద్రబాబు సర్కార్ మీద కేసీయార్ వైఖరి ఏంటన్నది మరో మారు స్పష్టమైందని అంటున్నారు.


వెలమ సంఘం నేతల హడావుడి :


కేసీయార్ దాదాపు రెండు దశాబ్దాల తరువాత విశాఖ వచ్చారు.  అదీ రెండవ మారు విజయభేరి మోగించి మరీ ధీరుడిగా ఈ గడ్డ మీద అడుగు పెట్టారు. దాంతో ఆయన సామజిక వర్గానికి చెందిన నేతలు విశాఖలో హడావుడి చేశారు. కేసీయార్ విశాఖ విమానాశ్రయంలో దిగడంతోనే ఘన స్వాగతం పలికిన ఈ నేతలంతా దారి పోడవునా కేసీయార్ బొమ్మల‌తో పెద్ద పెద్ద ఫ్లెక్సీలను కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక కేసీయార్ ని స్వయంగా కలుద్దామని వీరంతా భావించినా తెలంగాణా పోలీసులు ఏ ఒక్కరినీ వెళ్ళనీయ‌కపోవడంతో వారంతా నిరాశ చెందారు. ఇదిలా ఉండగా ఏపీ ప్రత్యేక హోదాకు కేసీయార్ మద్దతు ఇవ్వాలని కోరుతూ హోదా సమితి నాయకులు ఆయన్న్ని పత్రికాముఖంగా అభర్ధించడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: