సినిమా నటులు ఒక్కొక్కరుగా మెల్లగా జగన్ వైపునకు చేరుకుంటున్నారు. ఓ సినీ నటుడు పెట్టిన పార్టీ టీడీపీ. అందులో  ఎంతో మంది సినీ నటులు పోటీ చేసి రాజకీయంగా పదవులు అందుకున్నారు. గతంలో మొత్తం సినిమా పరిశ్రమ చంద్రబాబుకు అండగా ఉండేది. విభజన తరువాత సినీ సీమలోనూ విభజన కనిపిస్తోంది. తెలంగాణాకు సంబంధించినంతవరకూ కేసీయార్ కే జై కొడుతున్న సినీ ప్రముఖులు ఏపీకి రాగానే మాత్రం చంద్రబాబు, జగన్ గా విడిపోతున్నారు. 


జగన్ కి మద్దతు :


ఇక ఏపీలో అనూహ్యంగా సినిమా నటుల మద్దతు ఎక్కువగా జగన్ సంపాదించుకోవడం విశేషం. ఈ రోజు జగన్ని ప్రముఖ సినీ నటుడు భాను చందర్ కలసి తన మద్దతు తెలిపారు. శ్రికాకులం జిల్లా టెక్కలిలో పాదయాత్ర చేస్తున్న జగన్న్ని కలసిన భానుచందర్ కొంతసేపు జగన్ తో అడుగులు వేసి ముందుకు సాగారు. ఈ సందర్భంగా  భానుచందర్ మాట్లాడుతూ, జగన్ గొప్ప నాయకుడు అవుతారని అన్నారు. ఇలా ప్రజల కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అనూహ్యం, హం, అనితర సాధ్యమని అన్నారు. భానుచందర్ జగన్ని కలవడం తో ఆయన వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేస్తారని అంటున్నారు. 


అంతకు ముందే మరో సినీ నటుడు ప్రుద్వి  కూడా జగన్ కి మద్దతు ఇస్తూ పార్టీ ప్రచారం చేస్తున్న సంగతి విధితమే. ఇక సినీ నటుడు, మాటల రచయిత పోసాని క్రిష్ణ మురళి కూడా జగన్ కి మద్దతుగా మాట్లాడుతున్నారు. పాదయాత్ర కూడా జగన్ తో కలసి చేశారు. అదే విధంగా ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ క్రిష్ణ సైతం జగన్ని మెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు వైసీపీలోనే ఉన్నారు.  మొత్తంగా చూసుకుంటే సినిమా పరిశ్రమ లో మెజారిటీ ఇపుడు జగన్ వైపునకు మళ్ళుతోందని అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటున్న వారు, వైసీపీ అధికారంలోకి రావాలనుకుంటున్న వారు ఇపుడు జగన్ని కలసి తమ నైతిక మద్దతు ఇస్తున్నారు. జగన్ సైతం వారిని సాదరంగా ఆహ్నానిస్తూ వస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏమవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: