లక్ష్మీస్ ఎన్టీయార్ సినిమాలోని కుట్ర పాటను రిలీజ్ చేసి మంటలు రాజేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ చంద్రబాబునాయుడుకు కొత్త ఫిట్టింగ్ పెట్టారు. తనపై కేసులు పెడుతున్న చంద్రబాబును నిలదీశారు. సినిమా తీస్తున్నందుకే తనపై కేసులు పెడితే మరి చంద్రబాబును డైరెక్టుగా విమర్శించిన ఎన్టీయార్ పై ఎన్ని కేసులు పెట్టాలంటూ ఎదురు ప్రశ్నించటం గమనార్హం. మరి వర్మ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు ?

 Image result for ntr biopic varma

ఎన్టీయార్ బయోపిక్ పేరుతో రెండు సినిమాలు రెడీ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబును పాజిటివ్ గా ప్రొజెక్టు చేసే ఉద్దేశ్యంతో బావమరది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ  కథనాయుకుడు అనే ట్యాగ్ లైన్ తో ఓ సినిమా తీస్తున్నారు. ఎన్నికల్లో ప్రయోజనాలను ఆశించే సినిమా తీస్తున్నారుకాబట్టి బయోపిక్ లో మొత్తం పాజిటివ్ యాంగిలే ఉంటుందనటంలో సందేహంలేదు.

 Image result for ntr biopic varma

అదే సమయంలో వర్మ కూడా మరో బయోపిక్ తీస్తున్నారు. ఎన్టీయార్ రాజకీయజీవితంలో అత్యంత కాంట్రవర్సీ అయిన వెన్నుపోటు ఉదంతాన్నే ప్రధానంగ తీసుకుని వర్మ లక్ష్మీస్ ఎన్టీయార్ అనే సినిమా తీస్తున్నారు. అంటే రెండు సినిమాల్లో కథాంశాలు పూర్తి వైర్యుద్దాలతో ఉంటాయన్నది అర్ధమైపోతంది. దానికి తగ్గట్లే బాలకృష్ణ, వర్మ ఇద్దరు కూడా రెండు టీజర్లను రిలీజ్ చేశారు. ఒకేరోజు రిలీజ్ అయిన టీజర్లలో వర్మ రిలీజ్ చేసిన ‘కుట్ర’  బ్యాక్ డ్రాప్ పాట కలకలం  రేపింది. ఎన్టీయార్ వెన్నుపోటుకు సంబంధించిన పాటలో చంద్రబాబునే ప్రముఖంగా చూపించారు.

 Image result for ntr biopic varma

ఇపుడదే పెద్ద వివాదాస్పదమైంది. చంద్రబాబును వర్మ అవమానించారంటూ టిడిపి ఎంఎల్ఏలు, నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలుపెట్టారు. కర్నూలు ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వర్మపై ఫిర్యాదు చేయగానే కేసులు కూడా నమోదు చేసేశారు పోలీసులు. ఎటూ అధికారంలో ఉన్నారు కాబట్టి టిడిపి నేతలు ఫిర్యాదు చేయగానే ఎవరిపైనంటే వారిపై వెంటనే పోలీసులు కేసులు నమోదు చేసేస్తున్నారు. సరే, గతంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న వర్మ దీన్ని కూడా లెక్కచేయటం లేదు. పైగా చంద్రబాబును ఉద్దేశించి ఎదురుతిరిగారు.

 Image result for cases on rgv

తాను సిబిఎన్ ను ఒక్కమాట కూడా అనకపోయినా తనకు వ్యతిరేకంగా టిడిపి నేతలు ఆందోళన చేయటమేంటో అర్ధం కావటం లేదన్నారు. తానొకమాట అనకపోయినా తనపై కేసులు పెడితే చంద్రబాబును డైరెక్టుగా దూషించిన క్రింది వీడియోలోని వ్యక్తిపై ఎన్ని కేసులు పెట్టాలంటూ ఎదురు ప్రశ్నించటం గమనార్హం. వర్మ అడిగిన ప్రశ్నలో లాజిక్ ఉంది. మరి సమాధానం ఎవరు చెబుతారు ? అసలు వర్మపై కేసులు పెట్టాల్సిన అవసరమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. మరి వర్మ ప్రశ్నకు చంద్రబాబైనా రియాక్టవుతారా చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: