ఈ మద్య భారత దేశంలో ఎన్నికల సమరంలో బీజేపీకి చేధు అనుభవాలే మిగిలిపోతున్నాయి.  ఆ మద్య కర్ణాటకలో బీజేపీ ఎక్కువ లీడ్ చేసినా..చివరకు కాంగ్రెస్,జేడీఎస్ కూటమి కావడంతో బీజేపీ సీఎం హోదా నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చింది.  ఈ మద్య మద్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్ లో బీజేపీకి ఘోర పరాభవం జరిగింది. తెలంగాణ మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ తన ఉనికి చాటుకుంది.  దాంతో వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటుంది బీజేపీ.

ఈ నేపథ్యంలో వచ్చే యేడాది  జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. తమకు ఆమోదయోగ్యకరమైన విధంగా, సీట్ల సంఖ్య ఉంటేనే ఎన్డీయేతో కలిసుంటామని స్పష్టం చేసిన ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్, ఆరు సీట్లలో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 40 సీట్లుండగా, బీజేపీ, జేడీయూలు చెరో 17 సీట్లలో, మిగతావాటిల్లో ఎల్జేపీ పోటీ పడనున్నాయి.

అంతే కాదు అక్కడ ఎన్నికలు జరిగే ముందే పాశ్వాన్ ను రాజ్యసభకు పంపించేందుకూ ఎన్డీయే పెద్దలు అంగీకరించారు. పాశ్వాన్ ను రాజ్యసభకు పంపించనున్నామని అమిత్ షా స్వయంగా మీడియాకు తెలిపారు. పాశ్వాన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, 2014లో రాష్ట్రంలో 31 సీట్లలో విజయం  సాధించామని..ఈసారి అంతకు మించి సీట్లు సాధింయే ప్రయత్నం చేస్తామని అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: