ఏపి డిఎస్సీ పరీక్షలో 19వేల మందికి ప్రభుత్వం షాకిచ్చింది.  వివిధ సబ్జెక్టుల్లో అభ్యర్ధులకు ఈరోజు పరీక్షలు ప్రారంభమవుతాయి.  7902 పోస్టులకు గాను సుమారు 6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలోనే 19 వేలమంది అభ్యర్ధులు ‘టెట్’ లో అర్హత సాధించలేదన్న కారణంతో డిఎస్సీ పరీక్ష రాయటానికి అర్హత కోల్పోయారు.  తొలివిడతలో సోమవారం  నుండి స్కూల్ అసిస్టెంట్స్, పీజీటి, టిజిటి, ప్రిన్సిపాల్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్,  క్రాఫ్ట్, పండిట్, పీఈటి పరీక్షలు మొదలైంది. పై పరీక్షలను దాదాపు 2.5 లక్షల మంది రాస్తున్నారు. రెండో దశలో జనవరి 30వ తేదీ జరిగే ఎస్జీటి పరీక్షకు సుమారు 3.5 లక్షల మంది రాయనున్నారు.

 Related image

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 124 కేంద్రాల్లో పరీక్షలు సక్రమంగా జరిగేందుకు అన్నీ ఏర్పాట్లు జరిగాయి. ఏపిలో 113, ఒడిస్సాలో 3, తెలంగాణాలో 4, బెంగుళూరులో 2, చెన్నైలో 2 కేంద్రాల్లో పరీక్షలు మొదలయ్యాయి. ఏపిలోనే ఉద్యోగాల భర్తీ చేయకుండా చంద్రబాబు నిరుద్యోగుల సంఖ్యను పెంచేస్తున్నారని, మోసం చేస్తున్నారని లబోదిబోమంటుంటే ఇదే పరీక్షలకు ఒడిస్సా, బెంగుళూరు, చెన్నై నుండి కూడా అభ్యర్ధులు పరీక్షలు రాస్తుండటం గమనార్హం. జాబు రావాలంటే బాబు రావాలన్నది పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ ఇచ్చిన నినాదం.

 Related image

 

అప్పట్లో ఆ నినాదం యువకులను, నిరుద్యోగులను బాగా ఆకట్టుకున్నది. దానికితోడు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ప్రతీ నిరుద్యోగికి నెలకు రూ 2 వేల భృతి ఇస్తామని చెప్పటం కూడా పై వర్గాలను బాగా ఆకర్షించింది. అందుకనే మెజారిటీ సెక్షన్ చంద్రబాబుకు అనుకూలంగా ఓట్లేసింది. అయితే, ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో సహజశైలిలో చంద్రబాబు అందరి నెత్తినా గుడ్డేశారు. ఎన్నికల సమయంలో చేసిన హామీలకు మంగళం పాడారు. దాంతో నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు చేసినా ఉపయోగం లేకపోయింది.

 Image result for ap dsc 2018

మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వేరే దారిలేక నిరుద్యోగభృతిని మొదలుపెట్టారు. అది కూడా చెప్పిన హామీల్లో కోతలేసి. అదే సమయంలో డిఎస్సీ నిర్వహణ ద్వారా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం  చుట్టారు. భృతి ఇచ్చినా, డిఎస్సీ నిర్వహిస్తున్నా కేవలం వచ్చే ఎన్నికల్లో ఓట్లను దృష్టిలో పెట్టుకునే కానీ మరోటికాదన్న విషయం అందరికీ తెలుసు. ఆ చేసేదన్నా సక్రమంగా చేస్తున్నారా అంటే అదీ లేదు. అందుకనే వచ్చే ఎన్నికల్లో పై వర్గాల ఓట్ల విషయంలో తెలుగుదేశంపార్టీలో ఆందోళన స్పష్టంగా కనబడుతోంది. మొత్తానికి టెట్ ఎలిజిబులిటీ అన్న పేరుతో తాజాగా 19 వేల మందిపై వేటుపడింది. మరి వాళ్ళు ఎలా రియాక్టవుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: