జనసంకల్పయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు దశకు వస్తున్నా జనాల ఆదరణ మాత్రం అంతకంతకు పెరుగుతోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపు గ్రామీణ ప్రాంతాల క్రిందే లెక్క. ఒక్క విశాఖపట్నం నగరం మినహా మిగిలిన ప్రాంతం అంతా వెనుకబడిన ప్రాంతాల క్రిందే లెక్క. పైగా మూడు జిల్లాల్లో ఎక్కువ భాగం బిసి, ఎస్టీ, ఎస్సీ నియోజకవర్గాలే. కాబట్టి రాష్ట్రంలోని మిగిలిన తొమ్మిది జిల్లాలతో పోల్చుకుంటే మైదాన ప్రాంతాలు ఉత్తరాంధ్రలో తక్కువనే చెప్పాలి. అటువంటి జిల్లాల్లో కూడా జగన్ కు ఎక్కడ చూసినా జనాలు బ్రహ్మరథం పడుతున్నట్లే కనబడుతోంది.

 

జగన్ కు జనాలు ఎందుకంత బ్రహ్మరథం పడుతున్నారు ? కచ్చితంగా జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తారనే వాతావరణం ఏమీ కనబడటం లేదు. చంద్రబాబునాయుడు పాలనపై జనాల్లో వ్యతిరేకత ఉందన్నది అయితే వాస్తవమే. అయితే, ఆ వ్యతిరేకతను జగన్ ఏ మేరకు అడ్వాంటేజ్ తీసుకుంటారన్నదే అనుమానం. కానీ జనాలేమో రేపటి ఎన్నికల్లో జగనే అధికారంలోకి వచ్చేస్తున్నంతగా ఆదరిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న జగన్ కు జనాలు స్పందిస్తున్న విషయం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.

 Image result for ys padayatra tekkali

జగన్ దగ్గరకు వస్తున్న జనాలందరూ చంద్రబాబు పాలనపై మండిపడుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాలను ఏకరువు పెడుతున్నారు. పించన్లు అదటం లేదని, ఆపేశారని, రేషన్ కార్డులను నిలిపేశారని, తమకు మరుగుదొడ్డి మజూరైనా కట్టుకోవటానికి డబ్బులు ఇవ్వలేదని ఇలా..వ్యక్తిగతంగా వందలాది మంది ఫిర్యాదు చేస్తున్నారు. అదే సమయంలో తమ ఊరి సమస్యలను చెబుతున్నవారు కూడా చాలామందే ఉన్నారు. తమ ఊర్లలోని టిడిపి నేతల దాష్టికాలను ఏకరువుపెడుతున్న వారు కూడా చాలామందే ఉన్నారు. మొత్తం మీద నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనపై జనాల ఫిర్యాదులను జనాలకు బాగా ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టమవుతోంది. మరి జగన్ అనుసరించే వ్యూహాలపైనే అధికారంలోకి రావటం ఆధారపడుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: