పాస్‌ వర్డ్.. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన స్మార్ట్‌ ఫోన్ యుగంలో ఉన్నాం మనం. ఇప్పుడు మీ మొబైలే మీ బ్యాంక్, మీ ఏటీఎం, మీ సేవకుడు. ఎలాంటి సేవలు పొందాలన్నా కూర్చున్న చోటు నుంచి మొబైల్ లో ఓ ఆర్డర్ వేస్తే చాలు.. చిటికెలో వచ్చి వాలతాయికానీ ఇలాంటి సేవలన్నింటికీ అవసరమయ్యేది పాస్ వర్డ్..

Image result for PASS WORDS


ఈ మెయిల్ ఓపెన్ చేయాలన్నా.. నెట్ బ్యాంక్ ఖాతా యాక్సిస్ చేయాలన్నా.. ఫేస్‌ బుక్, ట్విట్టర్ వంటివి ఓపెన్ చేయాలన్నా.. చివరకు సొంత కంప్యూటర్ ఓపెన్ చేయాలన్నా పాస్ వర్డ్ వాడాల్సిన పరిస్థితి. మరి ఎన్నిపాస్‌ వర్డ్‌లను తయారు చేస్తాం.. ఎన్నని గుర్తుపెట్టుకుంటాం.. ఇదిగో ఇక్కడే చాలామంది సులభంగా బుట్టలో పడిపోతుంటారు.

Image result for PASS WORDS


పాస్ వర్డ్ ఎంచుకోవడంలో బోల్తా పడతారు. అందరికీ సులభంగా గుర్తుండే పాస్‌వర్డ్‌లు ఉపయోగిస్తుంటారు. అలాంటి వాటిలో కొన్ని 123456, 111111, 222222, 98765432.. ఇలాంటివన్నమాట. ఇలాంటి సులభమైన పాస్‌ వర్డ్ ల కారణంగా మీ బ్యాంక్ ఖాతాల వంటి కీలకమైన వాటిని హ్యాకర్లు, నెట్ మోసగాళ్లు సులభంగా ఓపెన్ చేస్తారు. మరికొందరు QWEERT, ASDFG, ZXCVB వంటి కీబోర్డుల్లోని వరుస పదాలు పాస్‌వర్డ్‌ గా వాడతారు. ఇది కూడా మంచిది కాదు.


Related image


చాలామంది తమ పేరును పాస్‌వర్డ్ గా పెట్టుకుంటారు. మరికొందరు తమ పేరుతో పాటు పుట్టిన సంవత్సరాన్ని యాడ్ చేసి పెట్టుకుంటారు. ఇలాంటివి కూడా సులభంగా దొరికిపోతాయిమరికొందరు వివిధ సేవల కోసం ఒకే పాస్‌ వర్డ్‌ ను వాడుతుంటారు. ఇది కూడా చాలా డేంజర్ఏళ్ల తరబడి ఒకే పాస్ వర్డ్ వాడటమూ మంచిది కాదు. పాస్‌వర్డ్‌లపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగు చూశాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త.



మరింత సమాచారం తెలుసుకోండి: