పాకిస్థాన్ రాజకీయాల్లో ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు అక్కడి ఓ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. సౌదీ అరేబియాలోని స్టీల్ మిల్ ఓనర్ షిప్ కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. పెట్టుబడులకు సంబంధించి ఆదాయ వనరులను షరీఫ్ చూపించలేక పోయారని ఈ సందర్భంగా జియో న్యూస్ తెలిపింది. 
Image result for nawaz sharif
జూలై 10న ఇదే కోర్టు షరీఫ్ కు 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది.  ఖరీదైన భవంతుల కొనుగోలు వ్యవహారంలో ఈ శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో నవాజ్ షరీఫ్‌కు  జైలు శిక్షతో పాటు 25 మిలియన్ డాలర్ల జరిమానాను విధించింది కోర్టు. ఈ కేసుకు సంబంధించి గత బుధవారం నాడు కొన్ని డాక్యుమెంట్లను సమర్పించేందుకు షరీఫ్ న్యాయవాది కోర్టును కోరారు.
Image result for nawaz sharif
అయితే  ఇందు కోసం కనీసం వారం రోజుల పాటు సమయాన్ని నవాజ్ షరీఫ్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. కానీ నవాజ్ షరీఫ్ న్యాయవాది అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. మొత్తానికి  అదే కోర్టు షరీఫ్ కు మళ్లీ షాకిచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: