జగన్ లో ప్రత్యేకత ఏముందని ఎవరని అడిగితే ఒక్క ముక్కలో దమ్ము , ధైర్యం అని చెప్పొచ్చు. 150 ఏళ్ల చరిత్ర గల పార్టీ ని ఎదిరించి ఏపీ లో ఆపార్టీకి నామరూపాలు లేకుండా చేసిన ఒక్క మగాడు అని చెప్పొచ్చు. కాంగ్రెస్ ను ఎదిరించిన ప్రతి ఒక్కరు తరువాత లొంగిపోయిన సంగతీ తెలిసిందే. జగన్  వైఎస్‌కు సిసలైన వారసుడు అనిపించుకున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని తుడిచిపెట్టాడు. ఆ పార్టీ మళ్లీ మొలవకుండా చేశాడు. తెలుగుదేశానికి గతంలో కాంగ్రెస్‌పార్టీ ఎలా ప్రత్యామ్నాయంగా నిలిచిందో... ఇప్పుడు తెలుగుదేశాన్ని కాదంటే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డే ప్రత్యామ్నాయం. ఇందులో సందేహాలు ఏమీలేవు.

Image result for jagan

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్లలో ఎంతో కొంతమేర పుంజుకుంది. అయితే ఏపీలో మాత్రం జగన్‌ అలాంటి ఛాన్స్‌ ఇవ్వలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఇక ఏపీలో మళ్లీ మొలకెత్తే పరిస్థితిలేదు. స్వతంత్రం వచ్చిననాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను జగన్‌ పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. గత ఎన్నికల్లో జగన్‌ ఓడిపోయినా.. ఆ వర్గాలు మళ్లీ జగన్‌తో పాటే నిలిచాయి. నిలుస్తున్నాయి.

Image result for jagan

జగన్‌ ఓడిపోయాడు కాబట్టి.. కాంగ్రెస్‌పార్టీ జాతీయ స్థాయిలో మళ్లీ కాస్త పుంజుకుంటోంది కాబట్టి... ఆ వర్గాలు జగన్‌ను పక్కనపెట్టలేదు. కాంగ్రెస్‌ పార్టీ గతంలో పోలిస్తే ఏపీలో మరింత వీక్‌ అయిపోయింది. కులాలకు, మతాలకు అతీతంగా.. కాంగ్రెస్‌కు ఉండిన ఓటు బ్యాంకు అంతా జగన్‌ వెంట నిలుస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కాంగ్రెస్‌ పార్టీ రావాలి అనుకుంటున్న వాళ్లు కూడా ఏపీలో కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితిలేదు. జగన్‌ సపోర్టుతో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ఆశించేవాళ్లూ కనిపిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు వేస్తున్న వేషాలను చూసి విసిగిపోయి, జగన్‌ సపోర్టుతో బీజేపీ అధికారంలోకి రావాలనే వాళ్లూ కనిపిస్తున్నారు. ఇలా జగన్‌ అన్నివర్గాల యాక్సెప్టెన్స్‌నూ పొందుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: