సైబర్ నేరగాళ్ళు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పేరును చక్కగా ఉపయోగించుకున్నారు. జగన్ పేరు చెప్పి చాలామంది వైసిపి నేతల నుండి భారీగా డబ్బు వసూళ్ళకు ప్రయత్నించారు. మరి ఎంతమంది నేరగాళ్ళ దెబ్బకు బలయ్యారనే విషయం బయటకు రాలేదు. మొత్తానికి నేరగాళ్ళు మాత్రం చాలా తెలివిగా ప్లాన్ చేశారన్న విషయం బయటపడంది. సైబర్ నేరగాళ్ళు కొందరు డబ్బు వసూళ్ళకు కొత్త పద్దతిలో వైసిపి అధినేత పేరును ఉపయోగించుకున్నారు. జగన్ పేరుతో ఫోన్లు చేయటం, మాట్లాడటం, డబ్బులు వసూళ్ళు చేయటం. దాంతో పార్టీలో ఎవరికో అనుమానం వచ్చి పార్టీ కేంద్ర కార్యాలయంతో మాట్లాడినపుడు విషయం బయటపడింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, ఎన్నికల సీజన్ కదా ? ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలు, టిక్కెట్ల కోసం ప్రయత్నించుకుంటున్న నేతలు తమ నియోజకవర్గాల్లో బిజీగా ఉన్నారు. అటువంటి సమయంలో ఓ నేతకు  జగన్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. పాదయాత్రలో ఉన్న కారణంగా తాను అన్నీ విషయాలూ వివరంగా చెప్పలేనని, తన తరపున ఫలానా వ్యక్తి మాట్లాడుతారని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. వెంటనే జగన్ పేరు చెప్పి మరో వ్యక్తి ఫోన్ చేస్తారు. జగన్ కు అత్యవసరంగా డబ్బు కావాల్సొచ్చిందని కాబట్టి ఓ రూ 10 లక్షలు  విశాఖపట్నం విమానాశ్రయానికి పంపాలంటూ చెబుతారు. విమానాశ్రయంలో ఫలానా వ్యక్తి ఫలానా సమాయానికి వెయిట్ చేస్తుంటారని చెప్పి ఫోన్ పెట్టేస్తారు.

 

దాంతో ఫోన్ అందుకున్న వ్యక్తుల్లో టెన్షన్ మొదలవుతుంది. అసలే ఎన్నికల సమయం కదా ? స్వయంగా జగనే చెప్పిన తర్వాత డబ్బు ఇవ్వక ఏం చేస్తారు ? సీన్ కట్ చేస్తే, అటువంటి ఫోన్లు జగన్ దగ్గర నుండి చాలామంది నేతలకు వచ్చాయట. ఎవరికో అనుమానం వచ్చి లోటస్ పాండులోని పార్టీ ఆఫీసుకు మాట్లాడితే విషయం మొత్తం బయటపడింది. జగన్ పేరుతో వచ్చే ఫోన్లు జగన్ పిఏ నెంబరుది. నెంబర్ వరకూ కరక్టే కానీ చేసేది మాత్రం పిఏ కాదు.  నేరగాళ్ళు జగన్ ఏపి నెంబర్ ను సంపాదించారు. స్పూఫింగ్ సాఫ్ట్ వేర్ పద్దతిలో పిఏ నెంబర్ నుండి జగనే మాట్లాడుతున్నట్లుగా నేతలకు భ్రమలు కల్పించారు.

 

 ఎలాగంటే జగన్ ఎప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా పిఏ నెంబర్ నుండే మాట్లాడుతారు. నేతలందరి ఫోన్లలోను ఫీడ్ అయ్యింది పిఏ నెంబరే కాబట్టి, తమకు ఫోన్ వచ్చింది కూడా పిఏ నెంబర్ నుండే కాబట్టి జగనే మాట్లాడుతున్నారనే అనుకున్నారు. ఆ విధంగా సైబర్ క్రిమినల్స్ నేతలకు ఫోన్లు చేసి భారీగా డబ్బులు తెమ్మన్నారని చెప్పారు. మరి ఎంతమంది క్రిమినల్స్ చెప్పినట్లుగా డబ్బులు ఇచ్చింది తెలీలేదు. ఎప్పుడైతే విషయం బయటపడిందో వెంటనే పిఏ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: