తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి స్థాపించిన నాటి కారణాలు అప్పటి జనాలకే కాదు. రాజకీయాలను గమనించే వారందరికీ తెలిసిన విషయమే. ఆయన అప్పట్లో ఎన్నికల ప్రచారంలో లంకించుకున్న  తిట్ల పురాణం కూడా ఎవరి మీదనో కూడా తెల్సిందే. అటువంటి మూల పురుషుడి సిధ్ధాంతాలను సైతం పక్కకు తోసేసేలా తమ్ముళ్ళు ఇపుడు గొంతు సవరించుకుంటున్నారు.


కాంగ్రెస్  వ్యతిరేకం కాదట:


కుక్క మూతి పిందెలు అంటూ కాంగ్రెస్ ని తిట్టిన తిట్టు తిట్టకుందా అన్న నందమూరి ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాలు నలుచెరగులా తిరిగి కాంగ్రెస్ కి పాతేరేశారు. దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ అన్న గారికి నాదెండ్ల భాస్కర రావు రూపంలో వెన్నుపోటు పెడిచింది. తరువాత ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తిన లేచి టీడీపీని మళ్ళీ నిలబెట్టింది. అందులో కాంగ్రెస్ వినా బీజేపీతో సహా మిగిలిన ప్రతిపక్షాలు అన్నీ  అంతా టీడీపీకి సహకరించి ఊపిరి పోసిన వారే. ఇదంతా చెరిపేసిన చెరగని గత చరిత్ర. కానీ తమ్ముళ్ళు టీడీపీకి ఆయువు పట్టు లాంటి మూల సిధ్ధాంతాలకే తిలోదకాలు ఇస్తూ కొత్త లాజిక్కులతో ముందుకు వస్తున్నారు. అసలు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా టీడీపీ పుట్టలేదని అంటున్నారు.


పెత్తదారీలపైన పోరాటం :


టీడీపీ ఆవిర్భవించింది పెత్తందారీల పైన పోరాటం కోసం తప్ప కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కాదని ఆ పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు అన్నారు. కాంగ్రెస్ కి తమ పార్టీ ఎపుడు వ్యతిరేకం కాదని చెప్పుకున్నారు. ఆ పార్టీ అప్పట్లో అనుసరించిన విధానాలను తాము తప్పుపట్టామని, ఇపుడు బీజేపీ విధానాలను విమర్శిస్తున్నామని అంటున్నారు. తాము  డిల్లీ పాలకుల పెత్తందారీ పోకడలను ఎపుడూ నిలదీస్తూంటామని ఆయన అన్నారు. 


నిరకుశత్వానికి  వ్యతిరేకం :


టీడీపీ కాంగ్రెస్ కి  కాదు, కేంద్ర పాలకుల  నిరకుశత్వానికి  కి వ్యతిరేకంగా పుట్టిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి యామినీ శర్మ అన్నారు. నవ్యాంధ్ర  ప్రయోజనాల విషయంలో తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుందని యామిని చెప్పారు. మోడీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడి గద్దె దించే ప్రయత్నంలోనే భాగంగానే కూటమి ఏర్పాటు చేసిన విషయాన్ని గ్రహించాలన్నారు ఇదంతా బాగానే ఉంది కానీ నిరకుశత్వం పెత్తందారీ విధానాల్లో కాంగ్రెస్ మాత్రం ఏం తక్కువ తిందని ఆ పార్టీకి టీడీపీ మద్దతు ఇస్తోందన్న మాటకు మాత్రం తమ్ముళ్ల వద్ద జవాబు ఉండదేమో. 


పైగా ఈ దేశాన్ని ఒక్క  పదేళ్ళు తప్ప మిగిలిన సమయం అంతా పాలించింది కూడా కాగ్రెస్ పార్టీనే. ఉమ్మడి ఏపీని అడ్డగోలుగా విడగొట్టి ప్రజాస్వామ్యాన్ని పాతరేసింది. ఎమెర్జెన్సీ విధించినది కూడా కాంగ్రెసే మరి. ఇక అన్న గారిని సీఎం పీఠం నుంచి దించేసిన పార్టీ కూడా కాంగ్రెసే. మరి ఇన్ని నీతులు చెబుతూ తమకు అతకని కొత్త లాజిక్కులు చెప్పుకుంటూ కాంగ్రెస్ తో పొత్తులను సమర్ధించుకోలేక సతమతం అవుతున్న టీడీపీ తమ్ముళ్ళకు ఇవన్నీ అర్ధమవుతాయా.


మరింత సమాచారం తెలుసుకోండి: