రిపబ్లిక్ టీవీ మరో మారు ఆంధ్ర ఎన్నికల గురించి సర్వే ఫలితాలను వెల్లడించింది . అయితే ఈ సారి అనూహ్య ఫలితాలను వెల్లడించింది. తాజా రిప‌బ్లిక్ టివి సర్వే ప్ర‌కారం ఏపి లో వైసిపి దే పైచేయి గా క‌నిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ -టిడిపి మ‌ధ్య పొత్తు కీల‌కంగా మారుతోంది.. ఏపిలో జ‌రగున్న ఎన్నిక‌ల పై రాష్ట్రంలోనే కాదు..దేశ వ్యాప్తంగా ఆస‌క్తి పెరుగుతోంది. ప్ర‌ధానంగా జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషించాల‌ని భావిస్తున్న టిడిపి అధినేత చంద్ర‌బాబుకు ఏపి లో బ‌లం చాటుకోవ‌టం అనివార్యం గా మారింది.

Image result for jagan padayatra

దీంతో..ఏపిలో ఆయ‌న బ‌లం ఏంట‌నే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఇదే క్ర‌మంలో జాతీయ ఛాన‌ల్ రిప‌బ్లిక్ టివి ఏపిలో లోక్‌స‌భ సీట్లు..ఎవ‌రికి ఎంత శాతం ఓట్లు అనే అంశం పై నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాల‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ స‌ర్వే ఫ‌లితాలు ఏపిలో సంచ‌ల‌నం గా మారుతున్నాయి. ఏపిలో పార్టీల బ‌లాబ‌లాల పై సీ ఓటర్‌తో కలిసి రిపబ్లిక్ టీవీ ప్రీ-పోల్ సర్వే నిర్వహించి సర్వే ఫలితాలను వెల్లడించిం ది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంచనాలు వెలువరించింది. బీజేపీకి వ్యతిరేక పార్టీలు ఏకం చేయడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో టీడీ పీకి గ‌తంతో పోల్చుకుంటే కొంత అనుకూలంగా ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది.

ఆధిక్యంలో వైసిపి..కోలుకుంటున్న టిడిపి..

అయితే, ఏపిలో టిడిపి - కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు ఉంటుందా. ఉండ‌దా అనేది ఇంకా తేలలేదు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత రెండు పార్టీల్లోనూ పొత్తు గురించి ఆందోళ‌న పెరుగుతోంది. దీంతో రిప‌బ్లిక్ టివి చేసిన స‌ర్వే టిడిపి - కాంగ్రెస్ పొత్తు ఉంటే ఏ విధంగా ఉంటుంద నే దాని పై ఆధారంగా నిర్వ‌హించారు. ఈ పొత్తు కార‌ణంగా టిడిపికి కొంత మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని రిప‌బ్లిక్ టివి త‌న స‌ర్వే లో అంచనాకు వ‌చ్చింది. ఒక వేళ‌..టిడిపి - కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు లేకుంటే..ఫ‌లితాలు మ‌రోలా ఉండే అవ‌కా శం ఉంది. దీంతో..పొత్తులే ఏపిలో కీల‌కంగా మార‌నున్నాయి.  ఏపిలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే వైసిపి వైపే ప్ర‌జ‌లు ఉన్న‌ట్లు రిప‌బ్లిక్ టివి అంచ‌నా కు వ‌చ్చింది. రిప‌బ్లిక్ టివి స‌ర్వే ప్ర‌కారం ఏపిలో మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల‌కు గాను..వైసిపి 14 సీట్లు గెలుస్తుంద‌ని అంచ‌నా కు వ‌చ్చారు. అదే విధంగా టిడిపి - కాంగ్రెస్ పొత్తు తో ఎన్నిక‌లకు వెళ్తే 11 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని పేర్కొంది. అందులో భాగంగా..టిడిపి 8 స్థానాలు.. కాంగ్రెస్ 3 సీట్లు గెలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు రిపబ్లిక్ టీవీ ప్రీ-పోల్ సర్వే వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: